Madhya Pradesh Serial Killer: ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకున్న మూడు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ హత్యలపై విచారణ కొనసాగుతుండగానే భోపాల్‌లో మరో హత్య జరిగింది. ఈ నాలుగు హత్యలు ఒకే తరహాలో జరిగాయి. ఈ నాలుగు ఘటనల్లో మృతులు సెక్యూరిటీ గార్డులే కావడం గమనార్హం. మృతులు నలుగురూ నిద్రిస్తున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. దీంతో ఈ హత్యల వెనక ఒక్కడే ఉన్నాడా అన్న అనుమానాలు కలిగాయి. పోలీసుల దర్యాప్తులో చివరకు అదే తేలింది. ఇంకా షాకింగ్ ఏంటంటే... ఈ హత్యలు చేసిన యువకుడు కేజీఎఫ్ సినిమా ప్రేరణతోనే హంతకుడిగా మారినట్లు చెప్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుడిని సాగర్ జిల్లా కేస్లీ గ్రామానికి చెందిన శివప్రసాద్ ధుర్వే (19)గా పోలీసులు గుర్తించారు. భోపాల్‌లో గురువారం (సెప్టెంబర్ 1) రాత్రి ఓ మార్బుల్ షాపు సెక్యూరిటీ గార్డు హత్యకు గురవగా.. ఆ హత్య కేసును చేధించే క్రమంలో శివప్రసాద్ పట్టుబడ్డాడు. విచారణలో సాగర్ జిల్లాలో జరిగిన ముగ్గురు సెక్యూరిటీ గార్డుల హత్యలు, భోపాల్‌లో జరిగిన సెక్యూరిటీ గార్డు హత్య శివప్రసాదే చేసినట్లు వెల్లడైంది. కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్ తరహాలో ఫేమస్ అయ్యేందుకే ఈ హత్యలకు పాల్పడినట్లు శివప్రసాద్ వెల్లడించడం పోలీసులను షాక్‌కి గురిచేసింది.


రాకీభాయ్ తరహాలోనే తాను కూడా గ్యాంగ్‌స్టర్ కావాలనుకుంటున్నానని.. భారీగా నిధులు సమకూర్చుకోవాలనుకున్నానని.. ఇందుకోసం ఫ్యూచర్‌లో పోలీసులను కూడా టార్గెట్ చేయాలనుకున్నానని శివప్రసాద్ పోలీసులతో తెలిపాడు. శివప్రసాద్ 8వ తరగతి వరకు చదువుకున్నాడని, గోవాలో కొన్నాళ్లు పనిచేశాడని, కాస్త ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడని పోలీసులు గుర్తించారు. 


నిందితుడు శివప్రసాద్ సాగర్ జిల్లాలో ఉత్తమ్ రాజక్, కల్యాణ్ లోధి, శంభురామ్ ధూబే అనే ముగ్గురు సెక్యూరిటీ గార్డులను భోపాల్‌లో మరో సెక్యూరిటీ గార్డును హత్య చేశాడు. ఐదు రోజుల్లోనే ఈ నాలుగు హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సెక్యూరిటీ గార్డు హత్య కూడా శివ ప్రసాద్ పనే అయి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు.


Also Read: అనుష్క 'అరుంధతి' సినిమా చూసి యువకుడి ఆత్మార్పణ.. కర్ణాటకలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన


Also Read:Telangana Jobs: రేపటి నుంచే వరుస నోటిఫికేషన్లు! తెలంగాణ నిరుద్యోగులకు పండగే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook