అనుష్క 'అరుంధతి' సినిమా చూసి యువకుడి ఆత్మార్పణ.. కర్ణాటకలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన

Youth Commits Suicide for Salvation inspired by Arundhati Movie: అరుంధతి సినిమా చూసి ఆత్మార్పణ చేసుకున్నాడో యువకుడు. మోక్షం సిద్ధిస్తుందనే మూఢ నమ్మకంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 13, 2022, 11:41 AM IST
  • కర్ణాటకలో షాకింగ్ ఘటన
  • అరుంధతి సినిమా చూసి యువకుడి ఆత్మార్పణ
  • మోక్షం కలుగుతుందనే మూఢనమ్మకంతో ఆత్మహత్య
అనుష్క 'అరుంధతి' సినిమా చూసి యువకుడి ఆత్మార్పణ.. కర్ణాటకలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన

Youth Commits Suicide for Salvation inspired by Arundhati Movie: ప్రముఖ హీరోయిన్ అనుష్క, దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అరుంధతి'సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్‌గా అనుష్క రేంజ్ మరింత పెరిగింది.  ఎప్పుడో 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం.. కర్ణాటకకు చెందిన ఓ యువకుడు ఈ సినిమా చూసి ఆత్మార్పణ చేసుకోవడం.

కర్ణాటకలోని తూమకూరు జిల్లాకు చెందిన రేణుకా ప్రసాద్ (23) అనే యువకుడు ఇటీవల అరుంధతి సినిమాను 15 సార్లు చూశాడు. ఇందులో హీరోయిన్ అనుష్క పునర్జన్మ పొందేందుకు ఆత్మార్పణ చేసుకునే సన్నివేశం ప్రసాద్‌ను బాగా ఆకట్టుకుంది. తాను కూడా అలా ఆత్మహత్య చేసుకుంటే మోక్షాన్ని పొందుతానని భావించాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెబితే.. తెలియక మాట్లాడుతున్నాడని ఏదో సర్దిచెప్పారు.

కానీ ప్రసాద్ మాత్రం అనుకున్నంత పని చేశాడు. బుధవారం (ఆగస్టు 11) 20 లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో గ్రామ శివారుకి వెళ్లి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అటుగా వెళ్తున్న కొంతమంది ప్రసాద్‌ను చూసి హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందాడు. మోక్షం కోసమే తాను ఆత్మార్పణ చేసుకున్నట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియో కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన తూమకూరు జిల్లాలో సంచలనం రేపింది. నిజానికి ప్రసాద్ పదో తరగతి వరకు చదువుల్లో టాప్ ర్యాంకర్‌గా ఉన్నాడు. ఇంటర్ ఫస్టియర్‌లో చేరాక సినిమాలకు బాగా అలవాటయ్యాడు. రాను రాను అదొక వ్యసనంలా మారింది. ఇదే క్రమంలో అరుంధతి సినిమాను వరుసగా 15 సార్లు చూసి అందులోని అనుష్క పాత్ర, సన్నివేశాలకు ప్రభావితమయ్యాడు. ఆ పాత్ర చేసినట్లే తనను తాను ఆత్మార్పణం చేసుకున్నాడు. ప్రసాద్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

Also Read : షాకింగ్.. ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం.. స్టేజీ పైనే 15 సార్లు కత్తితో పొడిచిన దుండగడు  

Also Read: Nayanthara: ఇంకా హనీమూన్ మూడ్ లోనే నయనతార-విగ్నేష్.. ఆ దేశానికి జంప్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News