Telangana Jobs: రేపటి నుంచే వరుస నోటిఫికేషన్లు! తెలంగాణ నిరుద్యోగులకు పండగే..

Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెలలో వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో  శాఖల వారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన పోస్టులను విడతల వారీగా భర్తీ చేయనుంది

Written by - Srisailam | Last Updated : Sep 3, 2022, 08:44 AM IST
  • తెలంగాణలో కొలువుల జాతర
  • సెప్టెంబర్ లో వరుస నోటిఫికేషన్లు
  • రేపో మాపో గ్రూప్ 2 నోటిఫికేషన్
Telangana Jobs: రేపటి నుంచే వరుస నోటిఫికేషన్లు! తెలంగాణ నిరుద్యోగులకు పండగే..

Telangana Jobs:  తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెలలో వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో  శాఖల వారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన పోస్టులను విడతల వారీగా భర్తీ చేయనుంది. ఇప్పటికే గ్రూప్​ 1 నోటిఫికేషన్​ రాగా.. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు రాబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తున్న  టీఎస్పీఎస్సీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. రెవెన్యూ, పంచాయతీరాజ్​, ఎంఏయూడీ, సచివాలయం, లేబర్​ కమిషనర్​ విభాగాల అధికారులతో సమావేశమై ఖాళీల వివరాలు తీసుకున్నారు. ఫైనాన్స్​ లో 25, జీఏడీలో 165, కామర్స్​ లో 38, లేబర్​ డిపార్ట్ మెంట్ లో  9, న్యాయ శాఖలో 6, సచివాలయంలో 15, పట్టణాభివృద్ధి శాఖలో 11, పంచాయతీ రాజ్​ లో 126, రెవెన్యూ శాఖలో 268 పోస్టులను గ్రూప్​ 2 కింద భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.

నిజానికి మొదట 582 గ్రూప్ 2 పోస్టులను మాత్రమే గుర్తించినా.. శాఖల వారీగా జాబితా వచ్చిన తర్వాత 663కు పెరిగింది. ఎక్సైజ్​ సబ్​ ఇన్స్​ పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, పంచాయతీరాజ్​ లో ఎంపీవోలు, జీఏడీలో ఏఎస్​ఓ పోస్టులు పెరిగాయి. గతంలో గుర్తించిన 582 ఖాళీలకు సంబంధించి రూల్స్​ ఆఫ్​ రిజర్వేషన్లు అధికారులు పూర్తి చేశారు. ఇప్పుడు పోస్టులు 663కి పెరగడంతో మళ్లీ కొన్ని  మార్పులు చేయాల్సి వస్తోందని.. అందుకే నోటిఫికేషన్ విడుదలకు కొంత ఆలస్యం అయిందని చెబుతున్నారు. సర్కార్ నుంచి అనుమతి రాగానే గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీని వేగవంతం చేస్తారని తెలుస్తోంది. గ్రూప్​ 2, గ్రూప్​ 3 ఎగ్జామ్ ను జనవరిలో నిర్వహించే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారానే, ఇంటర్వ్యూ లు లేకుండానే గ్రూప్​ 2 పోస్టులను భర్తీ చేయనుంది. పాత సిలబస్​ నే కొనసాగించాలని నిర్ణయించారు. 600‌‌ మార్కులకు రాత పరీక్ష ఉండనుంది.

ప్రొఫెసర్లు, జూనియర్ లెక్చరర్ల భర్తీకి లైన్ క్లియరైంది. సోమవారం 13 వందల 92 జూనియర్​ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. జూనియర్​ లెక్చరర్లతో పాటు డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్​ లెక్చరర్లకు సంబంధించిన 2262 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్​ ఇవ్వాలని భావించినా.. డిగ్రీ లెక్చరర్ల విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయంటున్నారు. దీంతో డిగ్రీ  484 డిగ్రీ లెక్చరర్లు, 386 పాలిటెక్నిక్​ లెక్చరర్ల పోస్టులకు నాలుగైదు రోజుల్లో విడిగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారని సమాచారం. రాత పరీక్ష నవంబర్​ లేదా డిసెంబర్​ లో ఉండే అవకాశం ఉంది. గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్​ లో ఉన్నందున.. దానికి ఇబ్బంది రాకుండా లెక్చరర్ల పోస్టుల రాతపరీక్ష ఉండేవా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉపాద్యాయ పోస్టులను TSPSC ద్వారానే నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన చెప్పారు. టీచర్ల పోస్టులను డీఎస్సీ కాకుండా టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?

Also Read: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News