Attack On Woman: ఇంటికి వచ్చి మంచినీరు అడిగి దాడికి పాల్పడ్డ దుండగులు.. చూసి కూడా సహాయం చేయని ఎదురింటి వాళ్లు!
స్త్రీ, పురుషులు అంటూ తేడా లేకుండా.. సహాయం అర్థిస్తూ.. సాధారణ జనాలపై దాడి చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జైపూర్ లో జరిగింది. మంచి నీళ్లు కావాలని మహిళని అడగటం.. ఆమెపై దాడి చేసి దోచుకెళ్లిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Attack On Woman: ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అనేది అస్సలు తెలియడం లేదు. మంచి అనే ముసుగులో వచ్చి దాడులకు పాల్పడుతున్నారు దుండగులు. ఆపదలో ఉన్నామంటూ సహాయం కావాలంటూ ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తున్నారు. కేవలం పురుషలే కాకుండా స్త్రీలు కూడా రకరకాల మారువేషంలో వచ్చి ఇళ్లల్లోకి దూరి అన్ని దోచుకెళ్తున్నారు. అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా ఇంటికి వచ్చి మంచినీరు అని అడిగి దాడికి పాల్పడ్డారు దుండగులు. ఇక ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి దాహం వేస్తుంది అంటే ఏమాత్రం ఆలోచించకుండా వారికి నీరు అందిస్తుంటాం. కానీ ఇక్కడ ఒక దుండగుడు చేసిన పనికి.. ఎవరైనా ఇంటి ముందు వచ్చి నీరు అడిగినా కూడా భయం వేస్తుందని చెప్పవచ్చు. అయితే తాజాగా జైపూర్ లో కర్ధాని లో ఉన్న మంగళం సిటీ సొసైటీలో ఒక ఇంటికి ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ లో వచ్చి ఆ ఇంట్లో ఉన్న మహిళను మంచినీరు కావాలి అని అడిగాడు.
దీంతో ఆ మహిళ లోపలికి వెళ్లి గ్లాస్ మంచినీరు తీసుకొని వచ్చింది. ఇక మళ్లీ అతడు ఇంకొంచెం వాటర్ కావాలని అడగటంతో.. మళ్లీ ఆ మహిళ లోపలికి వెళ్లి నీరు తీసుకొని వచ్చింది. ఇక అతడు చుట్టుపక్కల అంత గమనించి అక్కడ ఎవరూ లేనిది చూసి వెంటనే ఆ మహిళపై దాడి చేశాడు. ఇక ఆ మహిళ అతడిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతడు ఆమెను తన ఇంట్లోకే తీసుకొని వెళ్ళాడు.
Also Read: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్‌ఏ ఒక్కటే.. ఒకే గూటి పక్షులు: కిషన్ రెడ్డి
వెంటనే మరో ఇద్దరు దుండగులు కూడా లోపలికి వెళ్లి డోర్ వేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్లిపోయారు. ఆ బాధితురాలు కూడా వారి వెనకాలే పరిగెత్తడం జరిగింది. అయితే అదంతా అక్కడున్న సీసీ ఫుటేజీ ద్వారా రికార్డు అయింది. అయితే ఆ వీడియోలో గమనించినట్లయితే ఆ దుండగులు ఆ ఇంటి నుంచి పారిపోయేటప్పుడు.. అక్కడ ఎదురింటి వాళ్లు కనీసం సహాయం చేయకుండా డోర్ వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా జనాలు ఆ వీడియో చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది అని.. దయచేసి మహిళలు ఎవరైనా ఇంటికి వస్తే జాగ్రత్తగా ఉండండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
Also Read: 3D Printed Post Office: దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి