Man Suspicious Death in Kurnool: కర్నూలులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతి చెందగా.. ఇంట్లోనే అట్టపెట్టెలతో భార్య దహన సంస్కారాలు చేసింది. పత్తికొండ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకిత్తిస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. భర్తను భార్యే హత్య చేసి చీరలు వేసి అగ్గిపెట్టెలతో నిప్పు పెట్టినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌ (60) తెరుబజార్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. భార్య లలిత ఆయనకు తోడుగా ఉంది. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు కెనడాలో ఉంటున్నాడు. సోమవారం హరికృష్ణ ప్రసాద్ ఇంట్లో ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 


పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లలితను విచారించగా.. తన భర్త సోమవారం ఉదయం అనారోగ్యంతో చనిపోయారని తెలిపింది. తమ కుమారులు తమను పట్టించుకోవడం లేదని.. కేవలం ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని చెప్పింది. తండ్రి మృతి చెందిన విషయం తమ కుమారులకు తెలిస్తే.. ఇంటి వద్దకు వచ్చి ఆస్తి గొడవ చేస్తారని అందుకే తానే అట్టపెట్టెలు, చీరలు వేసి దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు పోలీసులకు తెలిపింది. 


తన భర్త తరుఫున బంధువులు ఎవరూ లేరని.. అందుకే తానే అంతిమ సంస్కారాలను నిర్వహించినట్లు పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరికృష్ణ ప్రసాద్‌ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయనది సహజ మరణామా..? లేక లలిత హత్య చేసిందా..? అసలు ఏం జరిగిందనే విషయాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


Also Read: BGMI Returns: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. BGMI వచ్చేసింది.. కండీషన్స్ అప్లై  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook