Mr Telangana Dies: నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు పెంచి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టిన మిస్టర్‌ తెలంగాణ చాంపియన్‌ మహ్మద్‌ సోహైల్‌ దుర్మరణం చెందాడు. ఎంతో మందిని బాడీ బిల్డర్లుగా తయారుచేస్తూ జిమ్‌ ట్రైనర్‌గా రాణిస్తున్న తెలంగాణ బాడీ బిల్డర్‌ సోహైల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. అతడి మృతితో బాడీ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Student Died In US: తెలుగు నేలను దిగ్భ్రాంతి గురి చేస్తున్న జలపాతాలు.. అమెరికాలో మరో విద్యార్థి


సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ సోహైల్ (24) బాడీ బిల్డర్‌గా రాణిస్తున్నాడు. సిద్దిపేటలో సొంతంగా జిమ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో బాడీ బిల్డింగ్‌ పోటీల్లో మిస్టర్‌ తెలంగాణ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సోహైల్‌ తన స్నేహితుడు మహ్మద్ ఖదీర్‌తో కలిసి జూన్ 29వ తేదీన సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపునకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. అదుపుతప్పిన బైక్‌ ఎదురుగా వస్తున్న స్క్రాప్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోహైల్‌ తీవ్ర గాయాలపాలవడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పది రోజులుగా చికిత్స పొందుతున్న సోహైల్‌ పరిస్థితి బుధవారం విషమించి మృతి చెందాడు.

Also Read: PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌


సిద్దిపేటకు చెందిన సోహైల్ అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అనేక చాంపియన్‌ పోటీల్లో టైటిళ్లను గెలుచుకున్నాడు. మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. బాడీ బిల్డింగ్‌ రంగంలో గొప్ప భవిష్యత్తు ఉన్న సోహైల్ చిన్న వయసులోనే మరణించడం అందరినీ కలచివేస్తోంది. అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోహైల్‌ మృతికి జిమ్‌ నిర్వాహకులు, బాడీ బిల్డర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter