AP Student Died In US: తెలుగు నేలను దిగ్భ్రాంతి గురి చేస్తున్న జలపాతాలు.. అమెరికాలో మరో విద్యార్థి

Andhra Pradesh Student Died In US Waterfall: గతేడాది అమెరికా వెళ్లిన యువకుడు ఊహించని సంఘటనలో జలపాతంలో చిక్కుకుని ఏపీకి చెందిన యువకుడు మృతి చెందాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 9, 2024, 04:23 PM IST
 AP Student Died In US: తెలుగు నేలను దిగ్భ్రాంతి గురి చేస్తున్న జలపాతాలు.. అమెరికాలో మరో విద్యార్థి

AP Student Dead In US: ఎన్నో కలలు.. ఆశలతో విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. ముఖ్యంగా తెలుగు వాళ్లు అనూహ్య సంఘటనలతో మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో తెలుగు విద్యార్థి అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సరదాగా కుటుంబసభ్యులతో విహారానికి వెళ్లగా జలపాతం నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. దిగ్భ్రాంతి కలిగించిన ఈ సంఘటనతో ఆ కుటుంబసభ్యులు కలచివేసింది. ఈ సంఘటనతో తూర్పుగోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది.

Also Read: PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌

 

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె సాయి సూర్య అవినాశ్ (26) ఎంఎస్‌ చేయడానికి 2023 జనవరిలో అమెరికా వెళ్లాడు. న్యూయార్క్‌లో అవినాశ్ తన తోబుట్టువైన సోదరి వద్ద ఉంటూ చదువుతున్నాడు. ఆదివారం (7 జూలై) సెలవు రోజు కావడంతో అక్క కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతానికి అవినాశ్‌ వెళ్లాడు. 

Also Read: Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు

 

జలపాతం ప్రాంతంలో కుటుంబసభ్యులతో సరదాగా ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు అవినాశ్ కిందపడిపోయాడు. కాలు జారి నీటిలో పడిపోయాడు. అతడ్ని రక్షించేందుకు మరొకరు నీటిలోకి  దూకగా అతడు కూడా కొట్టుకుపోయాడు. అయితే వెంటనే అక్కడి భద్రతా దళాలు, సహాయ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడగా.. అవినాశ్‌ మాత్రం మృతి చెందాడు.

అయితే ఊహించని సంఘటనతో అవినాశ్ సోదరి కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవినాశ్‌ మృతిపై అక్కడి తానా సంఘం సహకారం అందిస్తోంది. శుక్రవారం అవినాశ్‌ మృతదేహం స్వగ్రామం చేరుకునే అవకాశం ఉంది. అయితే అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణఘోష తీవ్రమైంది. నెల కిందట ఇద్దరు తెలుగు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల్లో జలపాతాల సందర్శనకు వెళ్లి మరణించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News