Gold Murder: పిల్లలకు పెళ్లిళ్లు చేసిన పెద్దావిడ ఇంట్లో ఒంటరిగా కాలం వెళ్లదీస్తోంది. అయితే ఆమె ఇంటి పక్కన ఉండేవాళ్లు శుభకార్యం ఉందని చెప్పి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు తీసుకున్నారు. శుభకార్యం జరిగి పక్షం రోజులు గడిచిన తీసుకున్న బంగారం తిరిగివ్వలేదు. వారిని అడిగితే వృద్ధురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బంగారం ఇవ్వమని చెప్పేశారు. ఆ ముసలామె ఏం చేయాలో తెలియక చుట్టుపక్కల వారికి జరిగిన మోసాన్ని చెప్పుకుని బాధపడింది. అయితే తమ పరువు తీస్తున్నావని చెప్పి బంగారం తీసుకున్న వాళ్లు వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇక బంగారం తిరిగివ్వాల్సిన అవసరం లేదని భావించి ఆమెను అంతమొందించారు. ఈ దారుణ సంఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Boy Hospitalised: పాడు సమాజం.. ఏపీలో అబ్బాయిపై సామూహిక అత్యాచారం


 


పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో వృద్ధురాలు ఓబులమ్మ (85) ఒంటరిగా జీవిస్తోంది. ఒక కూతురు ఉంటే ఆమె హైదరాబాద్‌లో స్థిరపడింది. తన పనులు తాను చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న ఓబులమ్మ వద్ద ఇటీవల అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి ఆభరణాలు తీసుకుని మళ్లీ ఇస్తామని చెప్పారు. శుభకార్యం జరిగి పది రోజులు దాటినా బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో ఓబులమ్మ ఆందోళన చెందింది. ఒకరోజు ధైర్యంగా వెళ్లి తన బంగారం తిరిగివ్వాలని కృష్ణమూర్తిని వెళ్లి అడిగింది. వృద్ధురాలితో వాగ్వాదం పడి బంగారం ఇవ్వమని తేల్చి చెప్పారు.

Also Read: Girl Pregnancy: పరీక్ష హాల్‌లో అడ్డం పడిన బాలిక.. ఆస్పత్రికి వెళ్తే గర్భవతి రూ.2 లక్షలకు ఖరీదు


ఒంటరిగా ఉన్న ఓబులమ్మ దిగాలు చెందింది. ఏం చేయాలో తెలియక కృష్ణమూర్తి కుటుంబం చేసిన మోసాన్ని చుట్టుపక్కల వాళ్లతో పంచుకుంది. అయితే బంగారం విషయమై అందరితో చెబుతుందని తట్టుకోలేక కృష్ణమూర్తి గొడవకు దిగాడు. గొడ్డలి తీసుకుని వచ్చి ఓబులమ్మపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆమె శరీర భాగాలను తీసుకుని పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు.

ఇది చూసిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వృద్ధురాలి కుటుంబసభ్యులు అనంతపురం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలి శరీర భాగాలు సేకరించి పోస్టుమార్టానికి తరలించారు. కృష్ణమూర్తి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలిని ఏడు తులాల బంగారం కోసం ఇంతటి దారుణానికి పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి