Dangerous Online Money Stealing Scams: మనం టెక్నాలజీకి దగ్గరవుతున్న తరుణంలో మన రోజువారీ అవసరాలకు ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. అయితే ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు.. ఇంటర్నెట్, టెక్నాలజీ కారణంగా ప్రయోజనాలను ఎలా కలిగి ఉన్నాయో.. దుర్వినియోగం కూడా అదేస్థాయిలో జరుగుతోంది. వీటిలో అత్యంత ప్రమాదకరమైనవి ఆన్‌లైన్ స్కామ్‌లు, హ్యాకింగ్‌లు. ఆన్‌లైన్ మోసాలతో ఎంతోమంది ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నారు. మన దేశంలో సైబర్ నేరాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది అత్యాశకు పోయి నిండా మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ కింద రకాల స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంక్ వివరాల అప్‌డేట్ పేరుతో..


మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా బ్యాంక్ వివరాలు అవసరమయ్యే ఇలాంటి గుర్తింపు కార్డులను అప్‌డేట్ చేయాలంటూ స్కామర్లు కాల్ చేసి.. ఓటీపీలను తెలుసుకుంటూ దోచుకుంటున్నారు. ఇలాంటి స్కామ్‌ల పేరుతో ఎక్కువ మంది మోసపోతున్నారు. మన దేశంలో ఏ బ్యాంకు కూడా తమ కస్టమర్‌లను ఏదైనా ప్లాట్‌ఫారమ్ కోసం వారి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయడం గురించి అడగదు. ఇలాంటి మెసేజ్‌లు వచ్చినా.. కాల్స్ వచ్చినా స్పందించకండి. 


లింక్స్‌పై క్లిక్ చేయంటూ..


'ఈ లింక్‌పై క్లిక్ చేయడం చేసి వివరాలను అప్‌డేట్ చేసుకోండి'.. 'ఈ లింక్‌పై క్లిక్ చేసి రివార్డు క్లైయిమ్ చేసుకోండి..' అంటూ సైబర్ నేరగాళ్లు గుర్తుతెలియని లింక్స్‌ పంపించి.. మోసాలకు పాల్పడుతున్నారు. మీకు వచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే.. మీ అన్ని బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయమని అడుగుతారు. ఆ తరువాత క్షణాల్లో మీ అకౌంట్‌ ఖాళీ అవుతుంది. గుర్తుతెలియని లింక్స్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.


కేవైసీ అప్‌డేట్ చేయమని..


కస్టమర్‌లను వారి కేవైసీ వివరాలను అడిగే అనేక ప్లాట్‌ఫారమ్‌లలో టెలికాం సేవలు, ఆన్‌లైన్ చెల్లింపు పోర్టల్‌లు ఉన్నాయి. అయితే ఆన్‌లైన్ నేరస్థులు దీనిని సాకుగా ఉపయోగించుకుంటూ.. ప్రజలకు ఎర వేస్తున్నారు. కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయంటూ వచ్చే మెసెజ్‌లు, కాల్స్‌కు అస్సలు స్పందించకండి. 


ఉచిత గిఫ్ట్ ఆఫర్‌ల పేరుతో..


ఉచిత బహుమతులు, కూపన్‌ల పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ లింక్‌పై క్లిక్ చేసి గిఫ్ట్‌లు, కూపన్లు క్లెయిమ్ చేసుకోండి అంటూ మెసెజ్‌లను పట్టించుకోవద్దు. ఉచిత బహుమతుల పేరుతో ఎర వేసి అకౌంట్‌లను ఖాళీ చేస్తున్నారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook