Telangana Rains: అకాల వర్షాలు తెలంగాణలో తీవ్ర విషాదం నింపుతున్నాయి. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో ఘోర ప్రమాదంలో దాదాపు ఏడు మంది చనిపోయిన విషయం మరచిపోకముందే మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా కోళ్ల ఫారమ్‌లో గోడ కూలి నలుగురు మృతి చెందగా.. బైక్‌పై భారీ వృక్షం కుప్పకూలడంతో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు, మరో చోట పిడుగు పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. శబరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు తప్పిన ఘోర ప్రమాదం


 


నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో సాయంత్రం కురిసిన భారీ వర్షం ధాటికి ఓ కోళ్ల ఫామ్ ప్రహరీ గోడ కూలి అందులో పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఓ కోళ్ల ఫారమ్‌ నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణ పనుల కోసం పలు గ్రామాల నుంచి కార్మికులు వచ్చారు. అయితే సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలిపోయింది. ప్రమాదంలో ఫారమ్‌ యజమాని మల్లేశ్‌తోపాటు చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో కొనప్రాణంతో ఉన్నారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలాన్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Anwarul Azim Anar Case: మహిళను ఎరగా వేసి ఎంపీ హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పసుపు పెట్టి పడేశారు


 


మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని చెట్టు పొట్టన పెట్టుకుంది. బైక్‌పై వెళ్తుండగా భారీ వృక్షం వారిపై కుప్పకూలింది. భారీ కొమ్మలు పడడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో పిడుగుపడి లక్ష్మణ్‌ (13) అనే బాలుడు మృతి చెందాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter