Bike Theft Cases: విశాఖపట్నం: చోరీకి గురవుతున్న బైకుల వెనుక సినిమా తరహాలో క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా షాక్‌కి గురవ్వాల్సిందే.  ఏజెన్సీతో పాటు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించి, ఆ తరువాత వాటిని తీసుకెళ్లి అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు పోలీసులు తెలిపారు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలో గత నెల 25న ఒక ద్విచక్ర వాహనం చోరీకి గురైందని ఆ బైక్ పోగొట్టుకున్న బాధితుడి నుండి ఫిర్యాదు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. ప్రతీ రోజు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు ఆయా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా వంతల సోమురాజు, ఆకేటి దుర్గా ప్రసాద్ ఓ బైకుపై వస్తూ పట్టుపడ్డారు. వారిని ఆపి వారి గురించి, ఆ బైక్ గురించి ప్రశ్నించగా ఒకదానితో మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆ ఇద్దరి వైఖరిపై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ముఠా గుట్టు రట్టయింది. 


చింతపల్లి ఏఎస్పి ప్రతాప్ శివ కిషోర్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులు వెల్లడించివ వివరాల ప్రకారం.. వంతల సోము రాజు , ఆకేటి దుర్గాప్రసాద్ , గెమ్మిలీ సన్యాస రావు , పాణి ప్రకాశ్, వంతల నాగేంద్రలు అంతా కలిసి ఓ ముఠాగా ఎర్పడీ మైదాన ప్రాంతంలో బైకుల చోరీ చేసి, వాటిని గంజాయి బ్యాచ్‌కు విక్రయిస్తున్నారు. బైక్ అమ్మి ఒకసారి డబ్బులు లేదా మరోసారి గంజాయి తీసుకునే వారు. సన్యాసి రావు వీటిని గంజాయి రవాణాకు లేదా గంజాయి ఎస్కాట్ అవసరాలకు ఉపయోగించేవాడు. ఒకవేళ గంజాయి తరలిస్తూ పట్టుబడే పరిస్థితి వచ్చినా.. ఆ బైకుని అక్కడే వదిలేసి పారిపోయేలా ఈ ఏర్పాటు చేసుకున్నాడు. గంజాయితో బైకు పట్టుబడినా... ఆ బైకు యజమాని వేరొకరు ఉంటారు కనుక తనకు ఇబ్బంది రాదు అనేది సన్యాసి రావు ప్లాన్ గా తెలుస్తోంది.


ఇది కూడా చదవండి : Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!


అలా కొన్ని రోజులు తమ గంజాయి స్మగ్లింగ్ అవసరాలకు ఉపయోగించుకున్న తరువాత మళ్లీ అనుమానం రాకుండా వాటిని తీసుకెళ్లి అక్కడికే సమీపంలోనే ఉన్న ఒరిస్సా ప్రాంతంలో విక్రయించే వారు. అలా పోలీసులు ఈ దొంగల ముఠా నుండి స్వాధీనం చేసుకున్న బైకుల్లో 13 బైకులపై కేసులు నమోదై ఉన్నాయి అని కొయ్యూరు పోలీసులు తెలిపారు. అందుకే సెకండ్ హ్యాండ్ సేల్ కింద బైకులు కొనే వారు అంతకంటే ముందుగా అది దొంగబండా లేక అసలైనదా అని నిర్దారించుకోవాలని.. లేదంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఇది కూడా చదవండి : Woman Gangraped And Naked: భర్తకి తెలియకుండా ఇద్దరు మగాళ్లతో డీల్ మాట్లాడుకున్న యువతి.. చివరకు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి