ATM Vandalism: సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న దొంగలు దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేయడానికి వెనుకాడడం లేదు. తాజాగా స్ప్రే కొట్టి రూ.25 లక్షల నగదును దోచుకుని పరారయ్యాడు. అయితే వాళ్లు స్ప్రే కొట్టింది మనుషులపై కాదు 'సీసీ కెమెరా'లపై. దోపిడీకి పాల్పడినది ఏటీఎమ్‌ కేంద్రంలో. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Student: సముద్రంలో ఢీకొన్న స్పీడ్‌ బోట్లు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం


నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌  ఏటీఎం ఉంది. బుధవారం (మార్చి 13) రాత్రి సమయంలో దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించారు. ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టి ముక్కలు ముక్కలుగా చేశారు. అనంతరం అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఏటీఎం యంత్రం భాగాలను ఫుట్‌పాత్‌పైన పడేశారు. తెల్లవారుజామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న పోలీసులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఏటీఎం సిబ్బందిని సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంక్‌ వివరాల ప్రకారం దాదాపు రూ.25 లక్షల వరకు నగదును దొంగలు ఎత్తికెళ్లి ఉంటారని తెలిసింది.

Also Read: Gangsters Marriage: అంగరంగ వైభవంగా గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. ఖైదీలు, గూండాలు, రౌడీలే అతిథులు


ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఏటీఎంలో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా దొంగల కదలికలు కనిపించాయి. తెల్ల రంగు బొలెరోలో నలుగురు దొంగలు వచ్చారు. ఏటీఎంలోకి రాగానే సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. దీనివలన వారి దొంగతనం సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. ఏటీఎం యంత్రాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసి ఉండవచ్చని తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు ఏటీఎం దోపిడీ పక్కా స్కెచ్‌ వేసి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగతనం తీరు చూస్తే ఇక్కడి ముఠా కాదని అంతర్రాష్ట్ర ముఠా పాల్పడి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter