Telangana Student: సముద్రంలో ఢీకొన్న స్పీడ్‌ బోట్లు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం

Telangana Student Dies In US: ఎన్నో ఆశలు.. కలలతో విదేశాలకు వెళ్తున్న తెలుగు యువత అక్కడ చిన్న చిన్న ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యువకుడు ఆటలు ఆడుతూ కుప్పకూలాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 13, 2024, 04:01 PM IST
Telangana Student: సముద్రంలో ఢీకొన్న స్పీడ్‌ బోట్లు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం

Telangana Student: ఉన్నత చదవుల కోసం కుటుంబాన్ని, ఉన్న ఊరును వదిలేసి విదేశాలకు వెళ్లగా అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఒక చిన్న తప్పు ప్రాణం తీసింది. పట్టాతో తిరిగి వస్తాడనుకుంటే శవంగా తిరిగివస్తుండడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. ఈ విషాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Woman Killed: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య.. సంచలనం రేపుతున్న భర్త వ్యవహారం

హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేశ్‌ కుమారుడు పిట్టల వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గతేడాది ఆగస్టు 22వ తేదీన అమెరికాకు వెళ్లాడు. ఇండియానా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ ఇన్‌ ఇన్ఫార్మటిక్స్‌ కోర్సు చేస్తుండేవాడు. చదువుతూ అక్కడే స్నేహితులతో కలిసి నివసిస్తుండేవాడు. ఈ క్రమంలోనే వారాంతం కావడంతో సరదాగా యాత్రకు వెళ్లాడు.

ఈనెల 9వ తేదీన పశ్చిమ ఫ్లోరిడాలోని కీ వెస్ట్‌ అనే ద్వీపకల్పం వాటర్ గేమ్స్‌కు వెళ్లాడు. వాటర్ గేమ్స్‌లో భాగంగా స్పీడ్‌ బోటు (జెట్‌ స్కై) నడుపుతూ వేగంగా వెళ్తున్నాడు. ఈ సమయంలో వెంకటరమణ వెనుకాల వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. రెండూ జెట్‌ స్కైలు ఢీకొట్టడంతో సముద్రపు నీటిలో పడి వెంకటరమణ మృతి చెందాడు. ఈ విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబసభ్యులకు సోమవారం సమాచారం అందించారు. మృతదేహం వారం రోజుల లోపు తరలిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. 

Also Read: Australia: ట్రెక్కింగ్‌ చేస్తూ కాలుజారి లోయలో పడి ఏపీ వైద్యురాలు మృతి.. ఆస్ట్రేలియాలో ఘటన

 

ప్రమాద వార్త విన్న వెంటనే కుటుంబసభ్యులు కుప్పకూలారు. ఏడాది తిరగకముందే తమ కుమారుడు శవమై తిరిగి వస్తుండడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఈ ప్రమాదం విషయంలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెట్‌ స్కైని నడిపిన వ్యక్తి ఒక బాలుడు, నిండా 14 ఏళ్లు కూడా నిండలేదని తెలిసింది. చట్టవిరుద్ధంగా బాలుడిని జెట్‌ స్కై నడపడంపై అక్కడి అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక మీడియా తెలిపింది. కాగా అమెరికాలో ప్రవాసులు జాగ్రత్తగా ఉండడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కారణాలతో కనీసం 8  మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News