Minor Rape Case: తెలుగు రాష్ట్రాల్లో అమీన్ పూర్ అనాధ ఆశ్రమ ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో సంగారెడ్డి ఫోక్సో ఫాస్ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. నిందితులు వేణుగోపాల్‌రెడ్డి, విజయ, జయ దీప్‌కు జీవిత ఖైదు విధించారు. 2020లో అమీన్‌ పూర్ మారుతి హోంలో దారుణ ఘటన వెలుగు చూసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోంలో ఓ బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అప్పట్లో ఈఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి దీనిపై వాదోపవాదలు జరుగుతున్నాయి. ఇవాళ సంగారెడ్డి ఫోక్సో ఫాస్ట్రాక్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. 


దీనిపై హైపవర్ కమిటీ విచారణ చేపట్టింది. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం, హత్యగా నిర్ధారణ జరిగింది. బాధిత బాలిక మల్టీ పుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి మృతి చెందినట్లు గుర్తించారు. మత్తు మందు ఇచ్చి బాలికపై తరచూ అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..నిందితులను అతి సమయంలోనే అరెస్ట్ చేశారు. అమీన్ పూర్ ఘటన నిందితులకు కఠిన శిక్ష పడటంపై హర్షం వ్యక్తం అవుతోంది.


కామాంధులకు ఉరి శిక్ష పడాలంటున్నారు. ఐనా రెండేళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడటాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు స్వాగతిస్తున్నారు.


Also read:Minister Peddireddy: ఏపీలో వ్యవసాయ కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్లు..మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..!


Also read:Dussehra Special Trains: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. ఆ వివరాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి