Tomato Theft in Delhi: టమటా ధరలు కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులు వాటివైపు చూడటమే మానేశారు. చాలా మంది వంటింట్లో టమటా మాయమై చాలా రోజులైంది. కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపు రూ.300 వరకు కేజీ అమ్ముతున్నారంటే ఏ స్థాయిలో ధరలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టమాటాలకు భారీ డిమాండ్ పెరగడంతో దొంగలు కూడా వాటిపై కన్నేశారు. టమోటాలను రక్షించుకునేందుకు ఓ వ్యాపారి ఏకంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. టమోట రైతులు రేయింబవళ్లు తమ పంటలకు కాపలాగా ఉంటూ రక్షించుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో ఐదు కేజీల టమాటాలు దొంగతనం చేసినందుకు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నజాఫ్‌గఢ్‌లోని కూరగాయల మార్కెట్‌లోని వ్యాపారి వద్ద నుంచి ఓ మహిళ నాలుగైదు టమోటాలు దొంగిలించింది. దీంతో కూరగాయల వ్యాపారి డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. తన షాపులో టమాటాలు ఎవరో దొంగతనం చేశారని ఫిర్యాదు చేశాడు.


కూరగాయల మార్కెట్ వద్దకు చేరుకున్న నజాఫ్‌గఢ్‌ పోలీసులు.. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. టమాటాలు దొంగతనం చేసిన మహిళను గుర్తించారు. అనంతరం ఆమె అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె టమోటాలు దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది.


తన షాపులో ఐదు కేజీల టమాలు చోరీకి గురయ్యాయని.. వాటి ఖరీదు రూ.1000 ఉంటుందని వ్యాపారి తెలిపాడు. ఆ రోజు ఢిల్లీలో కేజీ టమాటా 200 రూపాయలకు విక్రయించారని.. తనకు రూ.1000 చెల్లించాలని అన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసుల వద్దనే ఆ మహిళకు, వ్యాపారికి వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని మహిళతో మాట్లాడారు. అతనికి డబ్బులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరికి మహిళతో కూరగాయలు వ్యాపారికి 700 రూపాయలు ఇప్పించారు. అనంతరం ఇద్దరితో రాతపూర్వంగా సంతకాలు తీసుకుని రాజీ కుదుర్చి అక్కడి నుంచి పంపించారు. 


టమాట ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణలో కూడా సెంచరీ దాటిన ధరలు.. ఇప్పుడు డబుల్‌ సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. నెల క్రితం కేజీ టమాట రూ.50 లోపు ఉండగా.. ఇప్పుడు నాలుగు రెట్ల వరకు ధరలు పెరిగాయి. ఇక చంఢీగడ్‌ మార్కెట్‌లో రిటైల్‌ దుకాణాల్లో కేజీ టమాటను రూ.300 నుంచి రూ.400 మధ్య విక్రయాలు జరుగుతున్నాయి.


Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   


Also Read: Amazing Dance With Fingers: చేతివేళ్లతోనే డాన్స్ ఇరగదీశాడు పో


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి