Tragic Accident: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈసారి రీల్స్‌ చేస్తూ ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన ఘోర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించిన కుటుంబం అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలతోపాటు వారి కుమారుడు కూడా మరణించాడు. పోలీసులు, బంధుమిత్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kattappa Killed: దారుణంగా 'కట్టప్ప'ను చంపేసిన దొంగ.. కారణం తెలిస్తే షాకవుతారు


 


ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ అహ్మద్‌ (26), నజ్రీన్‌ (24) భార్యాభర్తలు కాగా.. వారికి అబ్దుల్లా అనే రెండేళ్ల కుమారుడు ఉన్నారు. వారు లఖీంపుర్‌ ఖిరీ జిల్లాలోని హర్గవ్‌ సమీపంలోని క్యోతి అనే గ్రామంలో జరిగిన శుభకార్యానికి అహ్మద్‌ తన భార్య, కొడుకుతో హాజరయ్యాడు. బుధవారం ఉదయం ముగ్గురూ సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వచ్చారు.

Also Read: Farmer Suicide: రైతు ప్రాణం తీసిన రుణమాఫీ.. ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్య


 


వీరికి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసే అలవాటు ఉంది. ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్దకు ముగ్గురూ బైక్‌పై వచ్చారు. అనంతరం పట్టాలపైకి వచ్చి అహ్మద్‌, నజ్రీన్‌, అబ్దుల్లా ముగ్గురూ రీల్స్‌ చేస్తున్నారు. రీల్స్‌ లోకంలో మునిగిన వారు వెనుకాల రైలు వస్తున్న విషయం గమనించలేదు. రీల్స్‌ చేస్తున్న వారి ముగ్గురిని లక్నో నుంచి మైలానికి వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు వారిని ఢీకొట్టింది.


రైలు వేగంగా ఢీకొట్టడంతో వారు ముగ్గురూ పట్టాలపై చనిపోయారు. వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పక్కనే సెల్‌ఫోన్‌ కనిపించింది. ఫొటోలు, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలు తీసుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణ అయ్యింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter