MP Upendra Singh Rawat Romance With Girl: ప్రస్తుతం దేశంలో ఎంపీ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం తమదైన స్టైల్ లో ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ మరోసారి తమకు అధికారం ఇవ్వాలని ప్రజలకు కోరుతుంది. హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించాలని ప్రజలను ప్రచారంలో అభ్యర్థిస్తుంది. మరోవైపు ఇండియా కూటమి, ఈసారి ఎలాగైన బీజేపీకి సరైన గుణపాఠం నేర్పాలని, మరలో దేశానికి పూర్వవైభవం తెస్తామంటూ ప్రచారం నిర్వహిస్తుంది.  ఇక రాహుల్ గాంధీ పాదయాత్రలతో బిజీగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Janhvi Kapoor: పొట్టి డ్రెస్‌లో కిరాక్ పుట్టిస్తోన్న 'దేవర' భామ జాన్వీ కపూర్..


ఇటీవల బీజేపీ అనేక రాష్ట్రాలలో తమ బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలసిందే. తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బారాబంకీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఒక యువతితో గదిలో రోమాన్స్ చేస్తున్న క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో యూపీ రాజకీయాల్లో ఇప్పుడిది హట్ టాపిక్ గా మారిపోయింది.


బీజేపీ మరోసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కొద్దిరోజులకు ఇలాంటి ఘటన వెలుగు చూడటం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ స్పందించారు. కొందరు కావాలనే ప్రజల్లో తనకున్న అభిమానంను చూసి ఓర్వలేక,  తన ప్రతిష్టను దిగజార్చేలా ఇలా నకిలీ క్లిప్పింగ్స్ లను వైరల్ చేస్తున్నారని ఆయన ఖండించారు. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి దినేష్ చంద్ర రావత్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆదిత్య త్రిపాఠి తెలిపారు.


Read More: Viral News: దండంరా నాయన.. అక్కడ ఏడాదికి ఒక్కరోజే స్నానం.. కానీ శరీరం నుంచి పర్ఫూమ్ స్మెల్ వస్తుందంట..


అయితే.. ఆన్‌లైన్‌లో ప్రసారమైన వీడియోలో ఒక వ్యక్తి మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఉపేంద్ర సింగ్ రావత్ అని చెబుతున్నారు. నిందితులను త్వరలోనే గుర్తిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్‌కు బీజేపీ టికెట్ నిరాకరించి ఉపేంద్ర సింగ్ రావత్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook