Janhvi Kapoor: పొట్టి డ్రెస్‌లో కిరాక్ పుట్టిస్తోన్న 'దేవర' భామ జాన్వీ కపూర్..

Jahnvi Kapoor: శ్రీ‌దేవి కూతురుగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.    ప్ర‌స్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌బోతుంది. అలు రామ్ చరణ్‌ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

1 /7

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది.

2 /7

బాలీవుడ్‌లో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీతో పలకరించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

3 /7

తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

4 /7

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరక్కుతోంది.

5 /7

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేయబోతుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది.

6 /7

తాజాగా జాన్వీ కపూర్ అనంత్ అంబానీ పెళ్లి వేడుకులకు పొట్టి డ్రెస్‌లో వచ్చి అభిమానులను కనువిందు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

7 /7

జాన్వీ క‌పూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది.