patamata girl molestation case : విజయవాడలోని పటమటలో ఘోరం జరిగింది. స్కూల్‌కు వెళ్లి వచ్చే బాలిక మీద ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా తెలియడంతో.. అసలు అత్యాచారానికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. అసలేం జరిగిందంటే.. బాలిక తన తాతయ్యతో కలిసి పటమటలో ఉంటుంది. అమ్మానాన్న లేకపోవడంతో అన్నీ తానై పెంచి పోషిస్తున్నాడు. బాలికతో ఓ ఆకతాయి పరిచయం పెంచుకున్నాడు. స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఓ భవనంలోకి తీసుకెళ్లి నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతటితో ఆగని ఆ దుండగుడు.. మరుసటి రోజు మళ్లీ తన ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అయితే ఈ ఘటనను ఇంట్లో చెప్పలేక తనలో తాను సతమతమైంది సదరు బాలిక. కొన్ని నెలల తరువాత తన శరీరంలో వచ్చిన మార్పులతో ఇంట్లో వాళ్లకి అనుమానాలు వచ్చాయి. దీంతో పరీక్షలు నిర్వహిస్తే.. సదరు బాలిక గర్భవతి అని తేలింది. 


దీంతో బాలిక తన మీద మే నెలలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన విషయాలను బయటపెట్టేసింది. దీంతో నెల 10న బంధువులంతా కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందుతుడు అయిన సాయికి నేర చరిత్ర ఉందని తెలుస్తోంది.


చోరీలకు పాల్పడుతూ ఆ డబ్బుతో అమ్మాయిలను ఉచ్చులోకి లాగుతుంటాడట. దేవాలయంలోని దొంగతనం కేసులో ఆల్రెడీ సాయి జైల్లోనే ఉన్నాడని సమాచారం. అతని స్నేహితుడైన అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


బాధిత బాలిక ప్రస్తుతం విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇప్పటికీ ఆ దారుణంలోంచి బయట పడలేకపోతోందట. ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.


Also Read : Acharya : 80 శాతం రెమ్యూనరేషన్ వాపస్.. ఆచార్య పేరు ఎత్తేందుకు ఇష్టపడని చిరు!


Also Read : ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook