Husband and Wife Crime News: భర్తపై బోర్ కొట్టిందో లేదంటే మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ అతడిని వదిలించుకోవడానికే డిసైడ్ అయిన ఓ భార్య మరో జంటతో కలిసి స్కెచ్ వేసింది. తన భర్తను మర్డర్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తానంటూ బేరం కుదుర్చుకుంది. తన భర్తను చంపేందుకు అంగీకరించిన భార్య, భర్తలు ఇద్దరికీ ( వేరే జంట) ముందుగానే రూ. 20 వేలు అడ్వాన్స్ సుపారి ఇచ్చింది. మిగతా డబ్బులు పని అయిపోయాకా అప్పజెబుతానని ఒప్పందం చేసుకుంది. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో జరిగిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 27న పాల్గర్‌లోని ఓ చిన్న కాలువలో 35 ఏళ్ల యువకుడి శవం ఉన్నట్టు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెళ్లి చూస్తే మెడ చుట్టూ, తలపై గాయాలై చనిపోయినట్టుగా అనిపించింది. పోస్టుమార్టం రిపోర్టులోనూ అదే తేలింది. పదునైన ఆయుధంతో మెడ, తలపై దాడి చేసి చంపినట్టు అటాప్సి రిపోర్టులో స్పష్టమైంది. గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. 


పాల్గర్ జిల్లాలో మిస్సింగ్ కేసుల వివరాలు చూస్తూ వాటితో సరిపోల్చిచూడగా.. ఒక మిస్సింగ్ కేసులో వ్యక్తి ధరించిన దుస్తులు, మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులతో సరిపోలడంతో అతడు ఎవరు, ఏంటి అనే విషయంలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అతడు గోరేగావ్ కి చెందిన వ్యక్తి అని ధృవీకరించుకున్నారు. ఆ తర్వాత అతడి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే మృతుడి కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇద్దరు దంపతులు మిస్సింగ్ అయినట్టు గుర్తించారు. ఆ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారు, ఎందుకు కనిపించకుండా పోయారు ? ఇతడి హత్య కేసుకు, వారికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.


కనిపించకుండా పోయిన దంపతులు ఎట్టకేలకు గుజరాత్‌లోని వాపిలో తలదాచుకున్నట్టు తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. అప్పుడు అసలు కథంతా బయటికొచ్చింది. మృతుడి భార్యనే తమతో లక్ష రుపాయల సుపారీ ఇస్తానని చెప్పి మర్డర్ డీల్ సెట్ చేసుకుందని.. ముందుగా రూ. 20 వేలు కూడా ఇచ్చిందని ఆ దంపతులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. హంతకులు ఇద్దరూ నేరం అంగీకరించడంతో వారి చేత భర్తను హత్య చేయించిన భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని చంపాల్సిన అవసరం ఆ భార్యకు ఏమొచ్చిందా అనే కోణంలోనే ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.


ఇది కూడా చదవండి : Powdered Human Bones: పిల్లలు పుట్టడం లేదని మనిషి ఎముకల పౌడర్ కలిపిన నీళ్లు తాగించారు


ఇది కూడా చదవండి : Cell Phone Tower Theft: సినీ ఫక్కీలో ఇంటి మీదున్న సెల్ ఫోన్ టవర్ చోరీ


ఇది కూడా చదవండి : Extra Marital Affairs: హవ్వ!! మరీ ఇంత బరితెగింపా ? లవర్‌తో మహిళ‌ అక్రమ సంబంధం.. అతడి కోసం కుటుంబంతోనే గొడవ


ఇది కూడా చదవండి : Man Injects Wife With HIV: భార్యకు హెచ్ఐవి బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook