Extra Marital Affairs: హవ్వ!! మరీ ఇంత బరితెగింపా ? లవర్‌తో మహిళ‌ అక్రమ సంబంధం.. అతడి కోసం కుటుంబంతోనే గొడవ

Married Woman Caught With Lover: తన మాజీ బాయ్ ఫ్రెండుతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆ మహిళ.. అత్తింటి వారికి పట్టుబడిన తరువాత కూడా తన వైఖరిలో మార్పు రాలేదు. అతడిని పోలీసులకు పట్టంచి తెలివిగా వారి నుంచి తప్పించింది. ఆ తరువాతేం జరిగిందో మీరే చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 09:52 PM IST
Extra Marital Affairs: హవ్వ!! మరీ ఇంత బరితెగింపా ? లవర్‌తో మహిళ‌ అక్రమ సంబంధం.. అతడి కోసం కుటుంబంతోనే గొడవ

Married Woman Caught With Lover: ఆమెకి పెళ్లయింది. ఒక బిడ్డకు తల్లి కూడా. బాధ్యతతో ఉండాల్సిన ఆమె జీవితం దారితప్పింది. కోరికలే గుర్రాలైతే ఇక ఆపేదెవరు అన్నట్టు పెళ్లి కాని తన మాజీ లవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఇంట్లో తన గదిలోనే తన లవర్ తో ఇంట్లో వారికి పట్టుబడి అడ్డంగా బుక్కయింది. దీంతో అత్తింటి వారి ఆగ్రహానికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. అత్తింటి వారికి, ఆమె లవర్ కుటుంబానికి మధ్య గొడవలు అయ్యాయి. కోడలి లవర్ ఆచూకీ కనుక్కుని మరీ అతడికి చుక్కలు చూపించసాగారు. తన అత్తింటి వారు తన ప్రియుడిని వేధిస్తున్న తీరు చూసి తట్టుకోలేకపోయిన ఆమె.. పోలీసులకు సమాచారం అందించి తెలివిగా అతడిని వారి వేధింపుల నుంచి తప్పించింది. బీహార్ లోని రోహ్తక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌లోని కైమూర్ జిల్లాకు చెందిన తన మాజీ బాయ్ ఫ్రెండుతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆ మహిళ.. అత్తింటి వారికి పట్టుబడిన తరువాత కూడా తన వైఖరిలో మార్పు రాలేదు. అతడిని పోలీసులకు పట్టంచి తెలివిగా వారి నుంచి తప్పించింది. ఆమెతో వేగలేకపోయిన ప్రియుడి కుటుంబం అక్కడి నుంచి బబువా అనే మరో ప్రదేశానికి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న మహిళ వెంటనే వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారి వాహనానికి అడ్డుగా నిలబడి ప్రియుడి కుటుంబంతో ఘర్షణకు దిగింది. అతడి కోసం ఏడిచి నానా యాగి చేసింది. తాను పెళ్లయిన మహిళను అనే విషయం కూడా మర్చిపోయి అత్తింటి వారి ముందే అతడి కోసం హైడ్రామాకు తెరతీసింది.

ఈ క్రమంలో మరోసారి అత్తింటి వారికి, ఆమె ప్రియుడి కుటుంబానికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి మీరే కారణం అంటే మీరే కారణం అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అదే సమయంలో ఆ గొడవలోనే ప్రియుడి కుటుంబం రహస్యంగా అతడిని అక్కడి నుంచి తప్పించింది. ఈ వివాదం కాస్తా మళ్లీ పోలీసు స్టేషన్ వరకు చేరింది. దాదాపు రెండు గంటలపాటు ఈ హైడ్రామా కొనసాగింది. అనంతరం ప్రియుడి కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

లవర్ కోసం పబ్లిగ్గా గొడవకు దిగి తమ కుటుంబం పరువు తీశావంటూ ఆమె అత్తింటి వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఆమె తల్లిదండ్రులను పిలిపించి వారితో పంపించారు. సంప్రదాయపు తెరలు దాటుకుని హద్దుమీరి ప్రవర్తించిన ఆ మహిళకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కానీ పరిస్థితిలో జుట్టు పీక్కోవడం పోలీసుల వంతయ్యింది. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x