Kolkata Murder Case: కోల్‌కతాలో శ్రద్ధా హత్య తరహా ఘటన.. తల్లితో కలిసి తండ్రి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన కొడుకు.. ఇలా దొరికిపోయారు
Son Killed Father in Kolkata: ఢిల్లీలో శ్రద్ధా హత్య ఘటనను మరువకముందే.. కోల్‌కతాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని హత్య చేసిన కొడుకు.. తల్లితో కలిసి మృతదేహాన్ని ముక్కముక్కలుగా కట్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయారు ఇలా..
Son Killed Father in Kolkata: పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన తల్లితో కలిసి తండ్రిని హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని దాచేందుకు తండ్రి మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికాడు. శ్రద్ధా హత్య తరహాలో తండ్రి మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. యువకుడు తల్లి సాయంతో బాత్రూమ్ లోపల రంపంతో తండ్రి మృతదేహాన్ని కట్ చేశాడు. మృతదేహం ముక్కలు బయటపాడేసి.. ఏమి తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. చివరికి వాళ్లే హత్య చేశారని తేలింది.
ఈ హృదయ విదారక సంఘటన కోల్‌కతాలోని బరుయ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. ఉజ్వల్ చక్రవర్తి (55) అనే వ్యక్తి నేవీ నుంచి రిటైర్ అయ్యాడు. బరుయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాస్ మల్లిక్ సమీపంలో భార్య శ్యామాలి (48), కుమారుడు జాయ్ (25)తో కలిసి నివసిస్తున్నాడు. జాయ్ పాలిటెక్నిక్‌లో ఓ కోర్సు నేర్చుకుంటుండగా.. పరీక్ష కోసం తండ్రిని రూ.3 వేలు అడిగాడు. అయితే చక్రవర్తి తన వద్ద లేవన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొడుకును చక్రవర్తి చెప్పుతో కొట్టాడు.
తనను చెప్పుతో కొట్టాడని కోపం పెంచుకున్న జాయ్.. తండ్రిని కిందకు తోశాడు. ఆవేశంతో అతడిని గొంతు పిసికి చంపాడు. అదే సమయంలో శ్యామాలి అక్కడికి వచ్చింది. ఇక ఇద్దరు కలిసి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలని ఆలోచించారు. మృతదేహాన్ని బాత్రూంలోకి లాక్కు వెళ్లి.. ఇంట్లో కలప పనులకు ఉపయోగించిన రంపాన్ని తీసుకుని ఆరు ముక్కలుగా కట్ చేశారు. తల్లీకొడుకులు ముందుగా సైకిల్‌పై మృతదేహం ముక్కలను విసిరేందుకు వెళ్లారు. అయితే ఆ తర్వాత రెండుసార్లు కొడుకు ఒక్కడే సైకిల్‌పై మృతదేహం ముక్కలు విసిరేయడానికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు బరుయ్‌పూర్ పీఎస్‌కి వెళ్లి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందని పోలీసులు వారిని విచారించగా.. ఇద్దరు కాస్త భయపడుతూ సమాధానాలు చెప్పారు. అనుమానంతో గట్టిగా అడగ్గా.. అసలు విషయం ఒప్పుకున్నారు. మృతదేహం ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Auto Rickshaw Blast: కదులుతున్న ఆటోలో మంటలు.. వెలుగులోకి షాకింగ్ విషయం
Also Read: IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. సంజూకి తప్పని నిరాశ! ఓపెనర్లుగా పంత్, ఇషాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి