55 Theaters closed in AP due to Ticket prices issue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తాజాగా సినిమా టికెట్ల ధరలను (Ticket Price) తగ్గించడంతో థియేటర్ల యజమానులు (Theater Owners) గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక.. థియేటర్లను నడపడం తమవల్ల కాదంటూ యజమానులే స్వచ్ఛందంగా మూసేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఏపీలోని గ్రామ పంచాయతీల పరిధిలో నడిచే 55 థియేటర్లు (55 Theaters) ఇప్పటికే మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45..  అనంతపురం జిల్లా పెనుకొండ.. కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం, పెనుగంచిప్రోలు.. శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో థియేటర్లకు యజమానులే స్వచ్ఛందంగా  మూసేశారు. దాంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఫాన్స్ థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.  కరోనా రెండో వేవ్ తగ్గాక ఓపెన్ అయిన థియేటర్లకు అఖండ, పుష్ప చిత్రాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ థియేటర్ల యజమానులపై పిడుగు పడినట్లయింది. జీఓ 35 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.10, రూ.15, రూ.20.. నాన్‌ ఏసీ థియేటర్లలో రూ 5, రూ.10, రూ.15.. మున్సిపాలిటీల్లో రూ.30, రూ.50, రూ.70.. కార్పొరేషన్‌ పరిధిలోని థియేటర్‌లలో రూ.40, రూ.60, రూ.100లకు విక్రయించాలి. తగ్గించిన ధరలతో వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోదని యజమానులు స్వయంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. 


Also Read: Omicron Scare: అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!


మరోవైపు ఏపీ (AP) రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి సినిమా థియేటర్లలో  (Cinima Theaters) అధికారులు తనిఖీలు మొదలెట్టారు. ఈ క్రమంలోనే కొందరు యజమానులు స్వయంగా థియేటర్లను మూసేస్తున్నారు. ఓ థియేటర్‌ యజమాని మీడియాతో మాట్లాడుతూ... 'కరోనా వైరస్ కారణంగా  థియేటర్లు సరిగా నడవడం లేదు. అరకొర లాభాలతో నెట్టుకొస్తున్నాము. ప్రభుత్వ తాజా నిబంధనలు ప్రకారం సినిమా హాళ్లు నడపాలంటే.. కరెంటు ఖర్చులు కూడా రావు. ఇక మా సిబ్బందికి జీతాలు ఎక్కడినుంచి ఇవ్వాలి. మరోవైపు ఓటీటీ, పైరసీల ప్రభావం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో థియేటర్లను స్వచ్ఛందంగా మూసేయక తప్పడం లేదు' అని అన్నారు. 


Also Read: Shyam Singha Roy Review: 'శ్యామ్ సింగరాయ్'గా హీరో నాని మెప్పించాడా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి