Naga Chaitanya Custody : ఒక్క పాట కోసం ఏడు సెట్లు.. నాగ చైతన్య, కృతి శెట్టిలపై భారీ ఖర్చు
Naga Chaitanya Custody నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది నాగ చైతన్యకు మరీ అంతగా కలిసి రాలేదు. బంగార్రాజు పర్వాలేదనిపించగా.. థాంక్యూ డిజాస్టర్‌గా నిలిచి అభిమానులను నిరాశపర్చింది.
Naga Chaitanya Custody song Shoot నాగ చైతన్యకు ప్రస్తుతం టైం సరిగ్గా కలిసి రావడం లేదు. లవ్ స్టోరీ వంటి క్లాస్ హిట్ పడ్డ తరువాత మరో విజయాన్ని అందుకోలేకపోతోన్నాడు. బంగార్రాజు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సంక్రాంతి సీజన్ కావడం, మిగిలిన సినిమాలు బెడిసి కొట్టడంతో బతికిపోయాడు. ఇక థాంక్యూ సినిమా అయితే డిజాస్టర్లకే డిజాస్టర్‌గా నిలిచింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఈ సారి నాగ చైతన్య ఓ తమిళ దర్శకుడితో రాబోతోన్నాడు
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చైతూ, కృతి లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం ఏకంగా ఏడు సెట్లు వేశారట.
ఈ ఏడు సెట్లో ఈ ఒక్క సాంగ్‌ను మాత్రమే షూట్ చేస్తారట. ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడట. దీంతో ఈ పాట అంత స్పెషాలిటీగా ఉంటుందా. ఒక్క పాట కోసం ఏడు సెట్లు వేయడం ఏంటి? ఇంత ఖర్చు పెట్టడం ఏంటి? అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయితే గానీ ఆ సాంగ్ ఏమేరకు కలిసి వచ్చిందో చెప్పలేం.
వెంకట్ ప్రభు తీసిన మానాడు సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. శింబుతో తీయడానికి కంటే ముందు ఆ కథను మన తెలుగు హీరోలకు వినిపించాడట. అందులో నాగ చైతన్య కూడా ఉన్నాడట. కానీ అప్పుడు ఆ కథను రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరి ఇప్పుడు కస్టడీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే అటు తమిళంలోనూ నాగ చైతన్య పాగా వేసినట్టు అవుతుంది.
Also Read: Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook