Aadi Keshava: వైష్ణవి తేజ్ ఆదికేశవ సినిమాతో మనకి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న వ్యక్తి  శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ పరవాలేదు అనిపించకండి. కాక దర్శకుడు శ్రీకాంత్ ఈ మధ్య విడుదల సూపర్ హిట్ అయినా ‘మ్యాడ్’ సినిమాలో నటుడిగా కనిపించారు. ఇక ‘మ్యాడ్’ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ద్వారానే ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదికేశవ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా నీ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసా గిస్తూ డైరెక్టర్. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన లైఫ్ స్టోరీ అందరినీ ఆకట్టు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీకాంత్ కుడి చేతిపై ఆడవాళ్ల పేర్లతో పచ్చబొట్లు ఉన్నాయి. బాగా యాంకర్ అసలు చేతి మీద ఆ పేరు ఏంటి అని అడగగా .. తనకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తల్లి స్నేహ చనిపోయారని చెప్పారు. ఆ తరవాత తనని తన పెద్దమ్మ, అమ్మమ్మ పెంచి పెద్ద చేశారని చెప్పుకొచ్చారు.  కాగా నెల్లూరులో ఇంజనీరింగ్ వరకు చదివి ఆ తరవాత ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాను అని.. అక్కడ బీపీఓగా నైట్ షిఫ్ట్‌లు చేసి విసిగిపోయి ఇంటికొచ్చేస్తానని పెద్దమ్మకు ఫోన్ చేశానని.. తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ వెళ్లారు ఈ దర్శకుడు.


‘బెంగళూరులో ఉద్యోగం చేయలేక మా పెద్దమ్మకు ఫోన్ చేసి.. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఇక్కడ నేను పడిపోతున్నానని నాన్నకు చెప్పాను.. వెంటనే మా పెద్దమ్మ నిన్ను ఎవడు ఉద్యోగం చేయమన్నాడు.. వచ్చేయ్ అన్నారు. ఇక అంటే వెంటనే బెంగళూరులో ఎక్కి నెల్లూరులో పడిపోయా.. ఇంటికి రాగానే మా అన్నయ్య, బావగారు అందరూ సిట్టింగ్ పెట్టారు. మా పెద్దమ్మ నా గురించి చెప్తోంది. ఏవయ్యా.. వాడు ఎందుకూ పనికిరాడు.. ఉదయాన్నే లేచి చొక్కా వేసుకొని డీసెల్ పట్టించుకోని బండిలో తిరుగుతూ ఉంటారు.. ఒక కళ్యాణ మండపమో, సినిమా హాలో పెట్టిస్తే సెటిల్ అయిపోతాడు అని చెప్పుకు రావడంతో.
 దానికి మా బావ కూడా ఒప్పుకున్నారు. ఇంత ఈజీనా మన లైఫ్ అనుకున్నా. కానీ నేను ఒప్పుకోలేదు. నేను సొంతంగా ఏమైనా చేస్తానని అన్నాను. హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పాను. ఇక్కడ అయ్యప్ప సొసైటీలో మా బావగారి స్థలం, మా అన్నయ్య స్పాన్సర్.. దాంతో ఏదో ఒక ిల్డింగ్ కట్టి అమ్మేసుకుంటే ఏడాదికి రూ.60 లక్షలు మిగులుతాయని పేపర్ మీద లెక్కలేశా. స్టార్ట్ చేశా.. సెల్లార్ కొట్టేశా. కాగా డ్రిల్లింగ్ మిషన్ పట్టుకుంటే నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేవి. మా పెద్దమ్మ దగ్గరకి వెళ్లి నేను ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెడదామని అనుకుంటున్నా అన్నాను. ఇది ఏడవరా ఫస్ట్ అన్నారు’


‘ కానీ ఎలానో నా లక్కు కొద్దీ తర్వాత అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులు ఆపేశారు. ఇక బార్ అండ్ రెస్టారెంట్ పెడతానన్నాను. ఎందుకురా అని మా పెద్దమ్మ అడిగారు. అన్నయ్య బార్ అండ్ రెస్టారెంట్ పెట్టి నష్టపోయారు. వాళ్లు పోగొట్టింది నేను తీసుకొస్తా అని చెప్పడంతో నన్ను నోరు మూసుకొని కూర్చోమనేవారు. మా పెద్దమ్మని రోజూ డబ్బుల కోసం తినేసేవాడిని. కోటిన్నర ఇస్తే మిగిలినది లోన్ పెట్టుకుంటా అనేవాడిని. అప్పుడు వెంటనే నేను కోటిన్నర ఇస్తే ఇంక లోన్ ఎందుకురా.. ఇంతకీ నువ్వు ఏం చేద్దామనిరా అని అడిగేవారు. ఈ వయసులో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు. అప్పుడు నేను నెల్లూరు వెళ్లి షార్ట్ ఫిలింస్ చేస్తానని చెప్పా. ఇక నాకు మొదటినుంచి  సినిమా తీయాలని ఉండేది. మా అన్నయ్య ఫ్రెండ్స్ ఆడిటర్లు ఉండేవాళ్లు. ఆ ఆడిటర్లు శ్రీను వైట్ల, అనిల్ సుంకరకు పనిచేసేవాళ్లు. వాళ్ళందరూ
.ఏముందిరా మేం చెప్తే నిన్ను అసిస్టెంట్‌గా పెట్టేసుకుంటారు అని చెప్పేవాళ్లు కానీ ఎప్పుడూ పెట్టించలేదు. మరి నేను షార్ట్ ఫిల్మ్ తీస్తా అంటే.. నీకొచ్చారా అని మా అన్నయ్య అడిగాడు. వచ్చేదేముంది తీయడమే అన్నాను. అప్పుడు మా పెద్దమ్మని షార్ట్ ఫిల్మ్ కోసం రూ.15 వేలు అడిగాను. అప్పటి వరకు నేను అడిగినవి పెద్ద పెద్ద అమౌంట్ కావడంతో ఇలా నేను 15000 మాత్రం అడిగిన వెంటనే
రువా ఓపెన్ చేసి డబ్బులు తీసి ఇచ్చేశారు' అని తన సినీ జర్నీ ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు.


‘షార్మ్ ఫిల్మ్‌కి ఒక హీరో కావాలి. అప్పుడు నా ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాడు. కానీ నాతో ఎప్పుడూ లండన్ వెళ్లిపోతాను మావ అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం రారా అని పిలిచాను. మొత్తానికి సినిమా తీసేశాం. ఇక ఇద్దరం కలిసి మా అన్నయ్య ఆఫీసుకు వెళ్లి సిస్టమ్ నుంచి అప్‌లోడ్ చేశాం. వెయ్యి వ్యూస్ వస్తే చాలు అనుకున్నాం. అప్పట్లో యూట్యూబ్‌లో 301 వ్యూస్ వస్తే ఇక అక్కడే ఆగిపోయేది. మాది కూడా అలాగే ఆగిపోయింది. కానీ, తర్వాత రోజు చూస్తే ఏకంగా 17 వేలు వ్యూస్ వచ్చాయి. కామెంట్లు మామూలుగా రాలేదు. నా ఫోన్ నెంబర్ పెట్టడంతో ఇండస్ట్రీలోని కొంత మంది నాకు ఫోన్లు చేశారు. మా షార్ట్ ఫిల్మ్‌ను మ్యాంగో మీడియా వాళ్లు మాకిచ్చేయండి అన్నారు. ఇక అక్కడి నుంచి వరుసగా సుదర్శన్, నేను షార్ట్ ఫిల్మ్‌లు చేశాం. అక్కడి నుంచి సుధీర్ వర్మ దగ్గర జాయిన్ అయ్యా. ఆయన నన్ను రైటర్‌ను చేశారు’ అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.


ఇక అలానే తనకు దర్శకుడిగా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాకు అవకాశం వచ్చిందని.. అది మధ్యలోనే ఆగిపోవడం చాలా బాధపడ్డానని తెలియజేశారు. ఆ బాధ నుంచి బయట పడడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత ‘ఆదికేశవ’ కథ రాసుకుని వైష్ణవ్ తేజ్‌కు నెరేట్ చేశానని.. ఆయనకు నచ్చడంతో ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు ఈ డైరెక్టర్.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook