బాలీవుడ్ ( Bollywood ) అగ్రనటుడు అమీర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. టర్కీ దేశ తొలి మహిళ, అధ్యక్షుడు ఎర్దోగాన్ భార్యను కలవడంపై నెటిజన్లు అమీర్ ( Aamir ) పై విమర్శలు ఎక్కుపెడుతుంటే..అభిమానులు మాత్రం సమర్ధిస్తూ ఆ ట్వీట్లను తిప్పికొడుతున్నారు. ఇంతకీ ఆ వివాదమేంటి..అమీర్ ఖాన్ టర్కీ ఎందుకెళ్లినట్టు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా చాలా కాలంగా బ్రేక్ పడిన షూటింగ్ లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ షరతులతో మళ్లీ ప్రారంభమవుతున్నాయి. బాలీవుడ్ దిగ్గజం అమీర్ ఖాన్ ( Aamir khan ) తన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా ( laal singh chaddha ) షూటింగ్ కోసం టర్కీ వెళ్లారు. ఈ సందర్భంగా టర్కీ తొలి మహిళ ఎమిన్ ఎర్దోగాన్  ( Turkey first lady Emin Erdogan ) ను మర్యాదపూర్వకంగా కలిశారు. అమీర్ ఖాన్ తో కలిసిన  ఫోటోల్ని ఆమెనే అధ్యక్షురాలే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశారు.



ప్రపంచ అత్యుత్తమ నటుల్లో ఒకడైన ఇండియన్ హీరో , దర్శకుడు, నిర్మాత అమీర్ ఖాన్ ను కలవడంపై ఆనందంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు. షూటింగ్ కోసం తన దేశానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.  1994లో విడుదలైన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ( Forrest Gump) కు ఈ సినిమా రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కరీనా కపూర్ నటిస్తోంది. Also read: Bigg Boss Hindi: సీజన్ 14 ప్రోమో రిలీజ్


కశ్మీర్ విషయం ( Kashmir issue ) లో పాకిస్తాన్ కు బహిరంగంగా టర్కీ మద్దతిచ్చిన నేపధ్యంలో ఆ దేశ తొలిమహిళను కలవడం మంచిది కాదంటూ నెటిజన్లు అమీర్ ఖాన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు మర్యాదపూర్వకంగా కలవడంలో తప్పులేదని అభిమానులు సమర్ధిస్తున్నారు. మొత్తానికి టర్కీ అధ్యక్షురాలిని కలవడం అమీర్ ఖాన్ కు వివాదం తెచ్చిపెడుతోంది. Also read: Nishikant Kamat: దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత