Bigg Boss Hindi: సీజన్ 14 ప్రోమో రిలీజ్

బిగ్‌బాస్ హిందీ షో ప్రతిఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సినిమాలకు రానంత క్రేజ్ హిందీ బిగ్‌బాస్‌కు వస్తుంది. ఈ హిందీ షోకి రేటింగ్స్ కూడా విపరీతంగా ఉంటాయి.

Last Updated : Aug 17, 2020, 04:02 PM IST
Bigg Boss Hindi: సీజన్ 14 ప్రోమో రిలీజ్

Hindi Bigg Boss 14 promo release: బిగ్‌బాస్ హిందీ షో ప్రతిఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సినిమాలకు రానంత క్రేజ్ హిందీ బిగ్‌బాస్‌కు వస్తుంది. ఈ హిందీ షోకి రేటింగ్స్ కూడా విపరీతంగా ఉంటాయి. అయితే తాజాగా బిగ్‌బాస్ 14వ ( Bigg Boss 14 )  సీజన్ 2వ ప్రోమోను కలర్స్ ఛానెల్ (Colors TV) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది. బిగ్‌బాస్ 14 సీజన్ షోకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( salman khan ) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి ప్రోమోలో ట్రాక్టర్‌పై కనిపించిన సల్మాన్ ఇప్పుడు దానికి భిన్నంగా కనిపించారు. Also read: JEE, NEET: పరీక్షలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

2020 ke manoranjan ka scene palatne aa raha hai #BB14, jald hi sirf #Colors par. Catch #BiggBoss2020 before TV on @vootselect. @beingsalmankhan

A post shared by Colors TV (@colorstv) on

కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా సినీ పరిశ్రమకు తలెత్తిన ఇబ్బందుల గురించి ఈ ప్రోమోలో ప్రస్తావించారు. అయితే ఈ ప్రోమోలో కూడా ‘స్వాగ్ సే కర్తేహే సబ్ కా స్వాగత్’ మ్యూజిక్ వస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌పై 2020 ఎన్నో ప్రశ్నలు తలెత్తెలా చేసింది.. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది.. వేడుకలకు సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే.. 2020కి బిగ్‌బాగ్ సమాధానం ఇస్తుందని సల్మాన్ ప్రోమోలో పేర్కొంటారు. అయితే ప్రోమో వచ్చిరాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.  Also read: Neeli Neeli Aakasam Song: 'నీలి నీలి ఆకాశం' మరో రికార్డ్

Trending News