నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్, మిమే గోపి, సురభి ప్రభావతి తదితరులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్


సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి


సంగీతం: రామ్ మిరియాల, అజయ్ అరసదా


నిర్మాత: అల్లు అరవింద్, బన్ని వాస్


దర్శకత్వం: అంజి కే.మణిపుత్ర



నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆయ్’ మూవీ. బన్ని వాస్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో అంజి దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పూర్తి హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..
ఫస్ట్ లాక్ డౌన్ తరువాత... సెకెండ్ లాక్ డౌన్ కి మధ్యలో ఈ కథ జరుగుతుంది. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కార్తీక్... లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోంతో గోదావరి జిల్లాలోని తన సొంతవూరు పాసర్లపూడి గ్రామానికి వస్తాడు. అతని తండ్రి ఆడబాల బూరయ్య(సీనియర్ నటుడు వినోద్ కుమార్). దానాలు చేసి రోడ్డుకు మీదుకు వస్తాడు.ఈ క్రమలో అదే ఊర్లో అతని  ఇద్దరు స్నేహితులు సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి), హరి(అంకిత్ కొయ్య) వుంటారు. వర్క్ ఫ్రం హోం కావడంతో వీరితో సరదాగా గడుపుతూ ఉంటాడు.అదే సమయంలో అదే గ్రామానికి చెందిన ఫంక్ పల్లవి(నయన్ సారిక)ని తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి వీరవాసం దుర్గ(మైమ్ గోపి) పేరు మోసిన రౌడీ. అతనికి కులాలు, ఆస్తులు, అంతస్తుల పట్టింపు ఎక్కువ. అయితే కార్తీక్, పల్లవి కులాలు వేరుకావంతో పల్లవి... తల్లిదండ్రుల కోరిక మేరకు వేరే అతనిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. మరి కార్తీక్... తను ప్రేమించిన అమ్మాయిని చివరకు దక్కించుకున్నాడా.. ? అ నేపథ్యంలో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


గోదావరి జిల్లాల వారి ఎటకారం ... వారి మమకారం మామూలుగా వుండదు. ఆ భాషలో వున్న హాస్యపు పరిమళం... ప్రేక్షకుల్ని  పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేస్తుంది. అందుకే ఆ భాషను బేస్ చేసుకుని వచ్చిన చిత్రాన్ని  ప్రేక్షకలను అలరించాయి. తాజాగా ఈ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆయ్’ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా నటీనటుల బలాలు, బలహీనతలను బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందించాడు. ఫస్ట్ మూవీతోనే ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడిగా సత్తా చాటాడు.  అంతేకాదుఈ  కథను ముందుకు నడిపించడంలో దర్శకుడు క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే... ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ‘మ్యాడ్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నార్నె నితిన్ ఈసారి ‘ఆయ్’ అంటూ ఆడియన్స్ ముందు వచ్చాడు. అతనితో పాటు రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య సహాయ నటులుగా చేశారు. నార్నె నితిన్ కి జోడీగా నయన్ సారిక నటించారు. ముగ్గురు స్నేహితుల నేపథ్యంలో ఆద్యంతం హాస్య భరితంగా ఈ సినిమా సాగేతా స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు. అంతేకాదు త్రివిక్రమ్ తర్వాత తన పెన్ పవర్ ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే ఎలాంటి హీరోయిజం లేకున్నా... ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ను సీట్లలలో కదలకుండా చేసాడు. ఈ సినిమాలోని సన్నివేశాలు సహజంగా ఉన్నాయి.  మరోసారి గోదావరి జిల్లాల అందాల్ని చూపించాడు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల ఎమోషన్, స్నేహితుల మధ్య బాండింగ్ ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు స్నేహితుల మధ్య బంధాన్ని కొత్తగా ఆవిష్కరించాడు దర్శకుడు.  ఈ సినిమాకు నేపథ్య సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.   ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం కూడా ఒకింత సినిమాకి లాభం అయింది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. సరదాగా ఈ సినిమాని చూసేయవచ్చు.


నటీనటుల విషయానికొస్తే..



నార్నె నితిన్ ‘మ్యాడ్’ సినిమాలో లాగే... చక్కటి నటనను కనబరిచాడు. తన పాత్రలో ఒదిగిపోయాడు. ఎక్కడా తడబాటు లేకుండా సినిమా మొత్తం మెప్పించే ప్రయత్నం చేశాడు. . అతనికి సహాయ నటులుగా నటించిన అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేశారు. నితిన్ కి జంటగా నటించిన నయన్ సారిక కూడా... సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా... ఏ విషయాన్నైనా చాలా సింపుల్ గా తీసుకుని... గలగలా మాట్లాడేసే గోదావరి జిల్లా అమ్మాయిగా అట్రాక్ట్ చేసింది. ఈ జనరేషన్ అమ్మాయిగా మెప్పించేసింది. కార్తీక్ తండ్రిగా వినోద్ కుమార్, పల్లవి తండ్రిగా మైమ్ గోపిల పాత్ర క్లైమాక్స్ లో ప్రేక్షకుల్ని కదిలించేలా ఉన్నాయి. బిగ్ బాస్ ఫేం సరయు పాత్ర కూడా బాగుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమతమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.


ప్లస్ పాయింట్స్


కథనం


స్క్రీన్ ప్లే


నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


ప్రీ క్లైమాక్స్ సాగదీత


హీరో, హీరోయిన్ లవ్ సీన్స్


పంచ్ లైన్.. నవ్వించే ఎమోషనల్ డ్రామా..!


రేటింగ్: 3/5


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter