Acharya Movie Collection: మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` తొలిరోజు కలెక్షన్ ఎంతో తెలుసా?
Acharya Movie Day 1 Collection: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆచార్య` చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Acharya Movie Day 1 Collection: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు రావడం సహా.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో 'ఆచార్య' రిలీజైన తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలిరోజు కలెక్షన్..
అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ తెలుగులో రిలీజైన 'ఆచార్య' చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ లో కొద్దిగా ఫర్వాలేదనిపించింది. తొలిరోజున ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.50 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు ఓవర్సీస్ కలెక్షన్స్ ను కలుపుకొని.. 'ఆచార్య' చిత్రం తొలిరోజున రూ. 33 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
సినీ ప్రేక్షకుల నుంచి 'ఆచార్య' సినిమాపై మిశ్రమ స్పందన రావడం వల్ల ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మరో రెండు, మూడు వారాల్లో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, సోనూ సూద్, సంగీత, కమెడియన్ సత్య తదితరులు నటించారు. 'సానా కష్టం' సాంగ్ లో హీరోయిన్ రెజినా కసెండ్రా తళుక్కున మెరిశారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: Acharya OTT Release Date: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ అప్పుడే?
Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.