Acharya Movie Teaser: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ టీజర్ విడుదలైంది. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా టీజర్ ఇది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తన గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుందనే గ్యారెంటీ ఈ టీజర్‌తో కలిగేలా మేకర్స్ ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేశారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Chiranjeevi to join Janasena ? : చిరంజీవి జనసేన పార్టీలో చేరనున్నారా ?


Ram Charan వాయిస్ ఓవర్‌తో మొదలైన Acharya teaser లో చిరంజీవి చెప్పిన ఓ డైలాగ్ ఆయన పాత్ర పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆచార్య అనే టైటిల్ ఆధారంగా చూస్తే ఆయన గురువు పాత్ర పోషిస్తున్నాడా అనే సందేహాలు ఇప్పటివరకు ఉండేవి. అయితే.. '' పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుషా గుణపాఠాలు చెప్తాననేమో '' అంటూ Chiranjeevi చెప్పిన డైలాగ్ ఈ సినిమాలో ఆయన పాత్రపై ఇంకొంత ఆసక్తిరేపుతున్నాయి. ఈ ఏడాది సమ్మర్‌లో Acharya Movie ఆడియెన్స్ ముందుకు రానున్నట్టు నిర్మాతలు ఈ టీజర్ ద్వారా వెల్లడించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook