కరోనా వైరస్ మహమ్మారి ఏ రంగాన్ని, ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. బాలీవుడ్‌లో మరో యంగ్ హీరో కరోనా బారిన పడ్డాడు. బాలీవుడ్ నటి మలైకా అరోరా బాయ్‌ఫ్రెండ్, హీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ (Arjun Kapoor Tests Positive For COVID19)‌గా నిర్ధారించారు. తనకు కరోనా పాజిటివ్ అని అర్జున్ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ప్రస్తుతం తనకు ఏ కరోనా లక్షణాలు లేవని, తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించాడు.  Harsh Vardhan: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇంట విషాదం 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. కరోనా సోకిందన్న విషయాన్ని తెలియజేయడం తన బాధ్యత అని అంటున్నాడు అర్జున్ కపూర్. తన ఆరోగ్యం వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తానని వివరించాడు. Nutan Naidu: నూతన్ నాయుడిపై మరో కేసు నమోదు



అయితే మలైకా అరోరా పరిస్థితి ఏంటి, ఆమెకు కూడా కరోనా వచ్చిందేమోనని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో అపార్ట్‌మెంట్‌లో వీరు కలిసి ఉన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు 
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి