Actor Chalapathi Rao Crazy Love Story Details: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు కార్డియాక్ అరెస్ట్ తో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా అనేక పాత్రలలో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ వంటి వారితోనే కాదు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారితో కూడా నటించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా అనేకమంది కుర్ర హీరోలతో నటించి దాదాపు మూడు తరాల హీరోలతో నటించిన వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆయన ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా గతంలో వెల్లడించారు. ఆయన బందరులో పియుసి చదువుతున్న సమయంలో ఒక యువతి ఆయనను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో వెంటనే ఆయన కూడా ప్రేమలో పడ్డారట. ఇందుమతి అనే అమ్మాయి తనను ప్రేమించినట్లుగా వెల్లడించడంతో తాను కూడా ప్రేమలో పడ్డానని తనను పెళ్లి చేసుకుంటావా అని ఆమె అడగడంతో మరో మాట కూడా లేకుండా వెంటనే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు చలపతి రావు.


తన ఇంట్లో తానే చిన్నవాడిని కావడంతో పెద్దలకు చెబితే ఇప్పుడే పెళ్లికి ఒప్పుకోరు అనే ఉద్దేశంతో రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుమతి పెళ్లి చేసుకుందామని చెప్పిన వారం రోజులకి స్నేహితులు తనకు ప్రేమ వివాహం చేశారని చెప్పుకొచ్చారు. ఇక తన భార్య చాలా ధైర్యవంతురాలు అని చెప్పిన చలపతిరావు ఏకంగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి మా ఆయనకు ఎందుకు మంచి పాత్రలు ఇవ్వరని అడిగిందని చెప్పుకొచ్చారు.


అయితే అనూహ్యంగా ఆమె 27 ఏళ్ల వయసులోనే ఒక అగ్ని ప్రమాదానికి గురై మరణించారు. అయితే భార్య మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న చలపతిరావు అప్పటినుంచి మరో వివాహం జోలికి గాని మరో మహిళ జోలికి కానీ వెళ్ళలేదట. చిన్న వయసులోనే ఆమె చనిపోయినా తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించి అనే రెండో పెళ్లి చేసుకోలేదని చెబుతూ ఉంటారు. ఎంతోమంది ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన ఎప్పుడూ తిరస్కరిస్తూనే వచ్చారట.


స్వయంగా కుమారుడు రవిబాబు ఆయనకు వివాహం చేయాలని ప్రయత్నించినా దాన్ని కూడా ఆయన తిరస్కరించారట. ముందు నుంచి తన భార్య ఇందుమతి తనను బాగా ఎంకరేజ్ చేసేదని ఒకరోజు నాటకం వేస్తున్న సమయంలో హీరోయిన్ దొరక్కపోతే ఆమె హీరోయిన్గా నటించిందని అవసరమైన రోజున పుస్తెలు తాకెట్టు పెట్టి మరి డబ్బులు ఇచ్చేదని చెప్పుకొచ్చారు. మందు తాగను, అమ్మాయిలతో తిరగను, సిగరెట్ తాగను అని ఆమెకు మాట ఇచ్చానని ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నానని గతంలో చలపతిరావు చెప్పుకొచ్చారు. మా మధ్య ప్రేమలేఖలు  లాంటివి లేవని కేవలం మాటలతోనే అంతా పూర్తయిందని వారం రోజుల్లోనే తాము పెళ్ళి వరకు వెళ్ళామని ఆయన చెప్పుకొచ్చారు.


Also Read: Chalapathi Rao: బుధవారం నాడు అంత్యక్రియలు.. అప్పటిదాకా మృతదేహం అక్కడే!


Also Read: Chalapathi Rao Cried: మిమ్మల్ని మళ్లీ చూస్తామో లేదో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చలపతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.