Actor Naresh on Marriage : `పవిత్ర`తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
Actor Naresh Pavithra Lokesh Marriage: సీనియర్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర ఇద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో తాజా ప్రెస్ మీట్ లో వివాహం గురించి క్లారిటీ చేశారు.
Actor Naresh Clarity about Marriage with Pavithra: సీనియర్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర ఇద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కన్నడ మీడియాలో రచ్చరచ్చ జరిగి తర్వాత తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత నరేష్ పవిత్రను నాలుగో పెళ్లి చేసుకున్నాడని, కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకపోవడంతో ఆయన ఒకవేళ వివాహం చేసుకున్నా వివాహం చెల్లదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ నరేష్ ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా కోసం చేస్తున్నాం అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేశాడు. పవిత్ర హీరోయిన్గా నరేష్ హీరోగా తెరకెక్కుతున్న మళ్లీ పెళ్లి అనే సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. కన్నడ తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్టర్ చేస్తున్నారు.
Also Read: Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్
స్వయంగా నరేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ప్రెస్ మీట్ లో నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నారా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్న ఇస్తే దానికి నరేష్ స్పందిస్తూ పెళ్లి అనేది రెండు హృదయాల కలయిక అని చెప్పుకొచ్చారు. అయితే మరోసారి మీరు వివాహం చేసుకున్నారా లేదా అని తాము అడుగుతున్నామని సదరు జర్నలిస్ట్ మళ్ళీ ప్రశ్నిస్తే అదేనండి మ్యారేజ్ అంటే యూనియన్ ఆఫ్ హార్ట్స్ అంటే హృదయాల కలయిక మరి మేము చేసుకున్నట్టా లేదా అని నరేష్ ఎదురు ప్రశ్నించారు.
అయితే అయిపోయినట్టే అని సదరు జర్నలిస్టు ముగిస్తూ ఉండగా నేను అనేది అది రెండు హృదయాల కలయిక అంటూ నరేష్ మరోసారి ప్రస్తావించారు. అయితే పక్క నుంచి పవిత్ర మాత్రం తల అడ్డంగా ఊపడం చర్చనీయాంశం అయింది. ఆమె ఈ ప్రశ్నకు సంబంధించి తల అడ్డంగా అవుతారా? లేదా? మరెవరితో అయినా సంభాషిస్తూ అడ్డంగా తలఊపారా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.
Also Read: Simran Choudhary Photos: షర్ట్ విప్పేసి 'బ్రా' అందాలతో సిమ్రాన్ అరాచకం.. ఈ హీటు తట్టుకోగలరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook