Naresh To Marry Pavitra Lokesh: సాధారణంగా మనుషులకు పక్కవారి పర్సనల్ విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఇక సినీ నటుల జీవితాల మీద అయితే చెప్పనక్కర్లేదు. అందుకే ఎప్పటికప్పుడు సినీ నటుల పర్సనల్ విషయాలు అలా బయటకు రావడంతోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా నటి,  దర్శకురాలు విజయనిర్మల కుమారుడు,  హీరో నరేష్ నాలుగో పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు ఆమె మరెవరో కాదు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ అందుకున్న నటి పవిత్ర లోకేష్ అని కూడా అంటున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ హీరోయిన్,  దర్శక -నిర్మాత అయిన విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతంలో హీరోగా నటించి అనేక హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక హీరోగా అవకాశాలు తగ్గాక కూడా ఏమాత్రం వెనుకకు తగ్గకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తండ్రి,  మామ పాత్రలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే వృత్తిపరంగా నరేష్ కెరీర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే సంగతి అందరికీ తెలుసు. ఇటీవలే ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి కారణంగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. 


ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితో విభేదాల కారణంగా విడిపోయిన నరేష్ తాజాగా ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారం మొదలైంది. ఇప్పుడే కాదు దాదాపు పదిహేను రోజుల పై నుంచే ఈ వ్యవహారం మీద వార్తలు బయటకు వస్తున్నాయి. దానికి ఊతం ఇస్తూనే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి మీడియా కంట పడుతున్నారు. ఈ జంట పలు సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. అలా ఏర్పడినప్పుడు పరిచయమే ప్రేమకు దారి తీసిందని వాదన వినిపిస్తోంది.  అయితే సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నరేష్ ఈ విషయం నిజం కాకుంటే ఇప్పటికే స్పందించి ఉండేవారని అంటున్నారు. 


దానికి తోడు ఇటీవలే వీరిద్దరూ కలిసి మహా బలేశ్వరంలోని ఒక గుడిలో దర్శనమివ్వడం కూడా ఈ పెళ్లి వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్టు అయింది. తమ పెళ్లి గురించి ఒక స్వామిజీతో మాట్లాడినట్లు మీడియాలో కధనాలు వస్తున్నాయి. పవిత్ర లోకేష్  సుచేంద్ర ప్రసాద్ అనే నటుడిని  వివాహమాడి కొన్ని విబేధాల వలన విడాకులకు అప్లై చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఆ కేసు నడుస్తోందని,  చట్టబద్ధంగా కోర్టులో విడాకులు మంజూరు కాగానే నరేష్,  పవిత్ర పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనేది వీరు నోరు విప్పితే తప్ప  తెలియదు.


Also Read: Naresh comments on Mohan Babu: టాలీవుడ్ హాట్ టాపిక్.. ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబే : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్


Also Read: Actor Naresh: లగ్జరీ కారవాన్‌ని కొనుగోలు చేసిన సీనియర్ నటుడు నరేశ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook