Raj Tarun Lavanya: సినీ పరిశ్రమలో సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ కేసు వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. అతడి ప్రేమ వ్యవహారం పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. అతడి ప్రియురాలు లావణ్య న్యాయం కోసం పోరాటం చేస్తుండగా.. తాజాగా జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌లో డిబేట్‌కు వచ్చిన ఆమె ఆర్‌జే శేఖర్‌ భాషాపై దాడి చేశారు. చెప్పు తీసుకుని అతడిపై విసిరికొట్టారు. దీంతో న్యూస్‌ స్టూడియోలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెంటనే జీ న్యూస్‌ చానల్‌ సిబ్బంది స్పందించి వారిద్దరినీ వేరు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raj Tarun: నేను 'పురుషోత్తముడు'ని.. అందుకే బయటకు రాలేదు


 


ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు హీరో రాజ్‌ తరుణ్‌పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలని నార్సింగ్‌ పోలీసులకు ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. ఆమె విషయమై రాజ్‌ తరుణ్‌ న్యాయ పోరాటం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే లావణ్య మాత్రం రాజ్‌ తరుణ్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అతడి సినిమా ప్రచార కార్యక్రమంలోనూ లావణ్య రచ్చ చేశారు.


Also Read: Raj Tarun: సినిమాల విషయంలో ఆశ్చర్యపరుస్తోన్న రాజ్ తరుణ్ నిర్ణయం.. ఏమన్నారంటే


 


రచ్చరచ్చ
ఈ వివాదంపై మొదటి నుంచి పూర్తిస్థాయిలో కవరేజ్‌ చేస్తున్న జీ తెలుగు న్యూస్‌ తాజాగా గురువారం లావణ్య, శేఖర్‌ భాషా మధ్య డిబేట్‌ నిర్వహించింది. లావణ్య తన వాదన చేస్తూ తనకు న్యాయం కావాలని కోరింది. అయితే లావణ్య చరిత్ర ఇది అంటూ శేఖర్‌ భాషా పలు ఆరోపణలు చేశారు. రాజ్‌ తరుణ్‌తో పరిచయం, ప్రేమ వ్యవహారాలతోపాటు ఇతరులతో లావణ్య సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు.


కన్నీటి పర్యంతం
ఈ ఆరోపణలపై ఖండిస్తూ తన వాదన వినిపిస్తున్న లావణ్య డ్రగ్స్‌ వ్యవహారం విషయంలో మాత్రం తీవ్రంగా స్పందించారు. చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్‌ ఇప్పించారని శేఖర్‌ భాషా ఆరోపించడంతో లావణ్య తీవ్ర ఆగ్రహానికి గురయి వెంటనే చెప్పు తీసి విసిరారు. శేఖర్‌ భాషాపై కాకుండా పక్కకు ఆ చెప్పు పడింది. తనపై దాడికి పాల్పడడంతో శేఖర్‌ భాషా వెంటనే పైకి లేచి లావణ్యతో వాగ్వాదానికి దిగారు. ఒక స్థాయిలో చేయి పట్టుకుని దాడి చేయబోగా వెంటనే జీ న్యూస్‌ సిబ్బంది స్పందించి వారిద్దరినీ వేరు చేశారు. భౌతిక దాడులు వద్దు.. కూర్చుని ఎంతైనా మాట్లాడుదామని వారించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లావణ్య కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర స్థాయిలో రోదిస్తూ డిబేట్‌ నుంచి వెళ్లిపోయారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook