Actor Satish Vajra Murderd : ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు కూడా చావడానికి చంపడానికి కూడా వెనుకాడడం లేదు కొంతమంది. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎలా అయినా సినిమాల్లో ఒక వెలుగు వెలగాలని భావించి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న ఒక యువకుడు సొంత బావమరిది చేతిలో హత్యకు గురయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతి భార్య అనారోగ్య కారణాలతో మరణించింది.  దీంతో రోజుల వ్యవధిలోనే భార్య,  భర్తలు అసువులు బాసినట్టు అయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే
 
జూన్ 18,  శనివారం నాడు బెంగళూరులోని పట్టనగెరె ప్రాంతంలోలో ఒక నటుడిని అతని బావమరిది కత్తితో పొడిచి చంపారు. మృతుడిని సతీష్ వజ్రాగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతానికి అతని వయసు  36 సంవత్సరాలు. కుటుంబ కలహాలతో సతీష్‌ను అతని భార్య సోదరుడు తన ఇంట్లోనే హత్య చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం సతీష్ భార్య ఆత్మహత్యకు పాల్పడి ఉండటమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సతీష్ షార్ట్ ఫ్లిలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించి తద్వారా కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా ఛాన్స్ అందుకున్నాడు. అలాగే 'లగోరి' అనే కన్నడ చిత్రంలో సహాయక పాత్రను కూడా పోషించాడు.
 
మండ్యలోని మద్దూరుకు చెందిన సతీష్ కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అతని భార్య ఏడు నెలల క్రితం మృతి చెందింది. అయితే ఆమె మరణించడానికి సకాలంలో వైద్యం అందకపోవడమే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం,  సతీష్ బావ,  తన సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ వచ్చి ఒక పథకం ప్రకారం కత్తితో సతీష్‌ను పలు సార్లు పొడిచి,  సంఘటన స్థలం నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. సతీష్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ,  సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 
 
సతీష్ వజ్ర మండ్య ప్రజ్వల్ దేవరాజ్ అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అలాగే ఒక పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క సెలూన్‌ను కూడా నడుపుతున్నాడు. సతీష్ కస్టమర్లలో కొందరు సినిమా నటులు కూడా ఉన్నారని అంటున్నారు. సతీష్ బసవన్న గుడి సమీపంలోని పట్టనగెరెలో నివాసం ఉండేవాడు. సతీష్ హత్యకు సంబంధించి అతని బావ సుదర్శన్,  మరో బంధువు నాగేంద్రను అరెస్ట్ చేశారు. సతీష్ అద్దెకుంటున్న ఇంటి యజమాని ఈ హత్య గురించి పోలీసులకు సమాచారం అందించారు. సతీష్ గత మూడేళ్లుగా అక్కడే అద్దెకు ఉంటున్నారట. ఆయన పక్క పోర్షన్ వ్యక్తి మెట్ల మీద రక్తపు మరకలు చూసి బిల్డింగ్ యజమానికి సమాచారం ఇవ్వడంతో హత్య వెలుగులోకి వచ్చింది,  ఆపై ఇంటి యజమాని స్పేర్ కీతో తలుపు తెరవడంతో సతీష్ గొంతు కోయబడి,  ఒంటి నిండా చాలా చోట్ల కతి పోట్లతో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించినా సతీష్ ను డాక్టర్లు కాపాడ లేకపోయారు. 
Also Read :Virata Parvam : బ్యాన్ చేయాలి.. సెన్సార్ అధికారి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read :Jr NTR : మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఇక రచ్చే అంటున్న ఫాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook