ఇండియన్ జర్నలిజం పీక్స్లో ఉంది. ఇది గర్వించదగ్గ విషయం అంటూ హీరో సిద్దార్థ్ వ్యంగమైన రీతిలో ఓ ఆంగ్ల దినపత్రికను విమర్శించారు. ఎక్కడా ఎటువంటి పరుషపదజాలాలు ఉపయోగించకుండా సింపుల్‌గా.. అందరికీ అర్థమయ్యేలా ట్విట్టర్‌లో పోస్టు పెట్టడంతో సదరు ఆంగ్లపత్రిక చేసిన తప్పును గ్రహించి సరిదిద్దుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఆంగ్లపత్రిక 2.ఓ హీరో సిద్దార్థ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని.. తప్పుడు ట్వీట్లు వస్తున్నాయని అంది. హీరో సిద్దార్థ్ తన 2.ఓ సినిమా ఆన్‌లైన్‌లో లీకైందని  అన్నారని సదరు ఆంగ్ల పత్రిక రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన సిద్దార్థ్- 'ఇండియన్ జర్నలిజం పీక్స్‌లో ఉంది. ఇది గర్వించదగ్గ విషయం. దయచేసి 2.ఓ సినిమా చూడకండి. మీకేమీ అర్థం కాకపోవచ్చు. అది నా సినిమా కాదు.  ఒక పెద్ద హీరో నటిస్తున్న..  లెజెండ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. థాంక్స్" అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేయడంతో వెంటనే సదరు ఆంగ్ల వార్త పత్రిక ఆ పోస్టును తొలగించింది.