Actor Suriya Daughter Diya 10th Class Marks : తన తండ్రి శివ కుమార్ నట వారసత్వం అందుకుని సినీ రంగ ప్రవేశం చేసిన సూర్య ఇప్పుడు తమిళనాట ఒక స్టార్‌ హీరో. 1997లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అన్నీ ఒకేరకమైన పాత్రలు కాకుండా వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ స్టార్ హీరో హోదాకు వెళ్ళాడు. అవడానికి తమిళ స్టార్‌ హీరోనే అయినా సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన మంచి మనసుకు, సేవా గుణానికి కూడా చాలా మంది ఫిదా అయ్యారు. ఎప్పటికప్పుడు ఆయన తన మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్యకు పుత్రికోత్సాహం కలిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య జ్యోతిక దంపతుల కుమార్తె దియా సాధించిన ఘనత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె గురించి తమిళ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన కుమార్తె దియా చదువులో ఫస్ట్‌ అని, క్లాస్‌ ఫస్ట్‌ వస్తుందని సూర్య పలు ఇంటర్య్వూలో చెబుతూ వచ్చేవారు. తాజాగా ఈ ఏడాది ఆమె పదో తరగతి పూర్తి చేసింది. ఇటీవల తమిళనాడు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడైన క్రమంలో ఆ ఫలితాల్లో దియా మంచి మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. 


అన్ని సబ్జెక్టుల్లోనూ తొంభైకి పైగా మార్కులు సాధించిన ఆమె అభినందనలు అందుకుంటోంది. మ్యాథ్స్ లో ఆమె వందకు వంద శాతం మార్కులు సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం దియా మార్కుల జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్ని సబ్జెక్ట్స్‌లో దియా సాధించిన మార్కులు ఈ మేరకు ఉనాయి. తమిళం, సోషల్‌ సైన్స్‌లో 95 మార్కులు, సైన్స్‌లో-98, ఇంగ్లిష్‌లో-99, మ్యాథ్స్‌లో-100 మార్కులు తెచ్చుకుంది. 


ఇక సూర్య తన భార్య జ్యోతికతో కలిసి కొస్టారికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ఈ జంట అడ్వెంచర్స్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. సూర్య లేటెస్ట్‌గా కమల్ హాసన్, విక్రమ్ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆయన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే, ‘ఆకాశమే నీ హద్దురా!’ హిందీ వెర్షన్‌లోని కీలకపాత్రలో సూర్య ఓ అతిధి పాత్రలో కనిపించనున్నారు.


Also Read: Karate Kalyani on Ram Gopal Varma : శ్రీకాంత్ రెడ్డి ట్రీట్మెంట్ వర్మకు కూడా ఇస్తానంటున్న కరాటే కళ్యాణి


Also Read: Nandamuri Balakrishna: కరోనా బారిన పడ్డ నట సింహం..వెల్లడించిన నందమూరి బాలకృష్ణ..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.