Amala paul UAE Golden Visa: అమలాపాల్ కు అరుదైన గౌరవం...యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న నటి..
Amala paul: నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
Amala paul UAE Golden Visa: నటి అమలాపాల్ (Actress Amala paul) అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం (UAE Govt) నుంచి ఆమె గోల్డెన్ వీసాను (Golden Visa) పొందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా (Social Meida) వేదికగా వెల్లడించారు అమలాపాల్. ''యూఏఈ గోల్డెన్ వీసా పొందడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా. ఇది ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతి. ఇది రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ ఆమె పేర్కొన్నారు.
గోల్డెన్ వీసా లభిస్తే...ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్చగా నివాసం ఉండేందుకు వీలుంటుంది. వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. అక్కడి ప్రభుత్వం 2019 నుంచి ఈ వీసాలు మంజూరు చేస్తోంది. సినిమా రంగం నుంచి..బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, సౌత్ బ్యూటీ త్రిష కృష్ణన్, నిర్మాత బోనీ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, టోవినో థామస్, మలయాళ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి తదితర ప్రముఖులు గోల్డెన్ వీసాను అందుకున్న వారిలో ఉన్నారు. ఈ వీసాను అందుకున్న వారిలో మెగా కోడలు, రామచరణ్ భార్య ఉపాసన ((Upasana Kamineni Konidela) కూడా ఉన్నారు.
Also Read: Upasana UAE Golden Visa: మెగా కోడలుకు అరుదైన గౌరవం..యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న ఉపాసన..
తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అమలాపాల్. ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల ఈమె హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటిస్తూ..బిజీగా గడుపుతోంది. ఈమె నటిస్తున్న కాడవర్, ఆడు జీవితం, అధో అంధ పరవై పోలా (Adho Andha Paravai Pola) ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ 'రంజిష్ హి సాహి' (Ranjish Hi Sahi) అనే వెబ్ సిరీస్‌తో హిందీలో కూడా అడుగుపెట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook