Actress Amani : జంబలకడిపంబ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఆమని ఆ తర్వాత ఎన్నో ఫ్యామిలీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా జగపతిబాబుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది ఆమని. ఆమె చేసిన చిత్రాలకు గాను రెండుసార్లు నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. కాగా ఆమని పెళ్లి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మధ్యనే సెకండ్ ఇన్ని స్టార్ట్ చేస్తూ కొన్ని సినిమాలలో తల్లి ఏ పాత్రల్లో కనిపించారు.  మిడిల్ క్లాస్ అబ్బాయి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలలో నటించారు. అయితే ఆమని హీరోయిన్గా చేసేటప్పుడు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమని తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎదుర్కున్న కష్టాలు ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో జరిగిన క్యాస్టింగ్ కౌచ్‌పై షాపింగ్ కామెంట్స్ చేశారు.


ఆమని మాట్లాడుతూ తను సినిమాలలో ప్రయత్నిస్తున్న సమయంలో తన ఫోటోలు చూసి చూసి పిలిచేవారని.. తీరా వెళ్లేసరికి ఈ అమ్మాయా? అని తన రంగు చూసి ఒప్పుకునే వారు కాదని ఆమని చెప్పారు. కాగా తన రంగు వల్ల తనని రిజెక్ట్ చేయడం తనకు చాలా బాధ వేసేదని చెప్పుకొచ్చారు.


ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ కన్నా తమిళంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేదని.. తను ఫేస్ చేశానని చెప్పారు ఆమని. అంతేకాదు సినిమాలో అవకాశాన్ని ఇస్తామంటూ పిలుస్తూ దరిద్రపు ప్రశ్నలు అడిగే వారిని .. స్ట్రెచ్ మార్కులు ఏమైనా ఉన్నాయా..  వేసుకోవాలి.. ఒకసారి బట్టలు విప్పి చూపిస్తారా? ‘వంటి అసభ్యకరమైన ప్రశ్నలు కొందరు తనను అడిగారని చెప్పారు ఆమని. 


అంతేకాదు ఏదైనా సినిమా ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత మేనేజర్ వచ్చి  డైరెక్టర్ గారో.. ఫైనాన్సరో మిమ్మల్ని ఓసారి బీచ్ దగ్గరకు రమ్మంటున్నారని పిలిచేవాడని.. ఒంటరిగా రమ్మని అడగటంతో విషయం అర్ధమై పోయేదని ఆమని అన్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా కానీ క్యాస్టింగ్ కౌచ్‌ ఉంటుంది అని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook