సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి 15ఏళ్ల సినీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాధ్, పలువురు దర్శకులు, అనుష్కతో పనిచేసిన సినీ రచయితలు కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడు రాజమౌళి ‘స్వీటీ’ అనుష్క కష్టించేతత్వాన్ని, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవడం ఆమె ప్లస్ పాయింట్ అని ప్రశంసించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: అనుష్కపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు


ఇండస్ట్రీలో ఎన్నో హిట్ మూవీల్లో నటించినా తాను సాధించిందేమీ లేదన్నారు నటి అనుష్క. స్వీటీ ఏమన్నారంటే ‘ఈవెంట్‌కు హాజరైన దర్శకులు, టెక్నీషియన్లు, అభిమానులకు నమస్కారం. ఇండస్ట్రీలోకి స్వీటికి 15 ఇయర్స్ అని అంతా అంటున్నారు. కానీ ఇండస్ట్రీలోని గొప్ప నటులతో పోల్చితే నేను సాధించింది చాలా తక్కువ. ఇంకా చాలా కష్టపడాలి. 


See Pics: స్వీటీ అనుష్క స్వీట్ ఫొటోలు



మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ట్రై చేస్తాను. ఎంతో బాధ్యతగా నడుచుకుంటూ ఇంకా మంచి మూవీలు చేస్తాను. నటన రాని నాకు పూరీ జగన్నాథ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూపర్ నుంచి నిశ్శబ్ధం వరకు దర్శకులు, టెక్నీషియన్లతో ఎంతో నేర్చుకున్నాను. ఈ అనుభవం అంతా కలిపితే నా 15ఏళ్ల సినీ జీవితమని’ అనుష్క స్వీట్‌గా తన స్పీచ్ ముగించారు.


See Pics: సెగలు రేపుతున్న రామ్ చరణ్ భామ


కాగా, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్ధం సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. తన సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను అనుష్క కోరారు. గ్యాప్ తర్వాత తెరమీద కనిపించనున్న అనుష్క ఈ సినిమాలో మూగ అమ్మాయి పాత్ర పోషించారు.


మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..