Actress arrested in pune: పుణేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పలు వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు పోషించి సినీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఒక వర్ధమాన నటి పోలీస్ ఆఫీసర్ ను కరిచినట్లు సమాచారం. పోలీస్ ఆఫీసర్ ను కరవడంతో వెంటనే ఆమెను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం ఏమిటంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక 28 ఏళ్ల యువతి సినీ అవకాశాల కోసం ముంబై వచ్చింది. ముంబైలోని అందేరి ప్రాంతంలో నివసిస్తున్న సదరు యువతి ఒక పని మీద పూణే వెళ్ళింది. పూణేలో బస చేయడం కోసం ఒక హోటల్ ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్ లైన్లో డబ్బులు కట్టేసింది కానీ ఆ హోటల్ రూమ్ మాత్రం ఆమెకు నచ్చలేదు. దీంతో తనకు వేరే గది ఇవ్వాలని కోరినా హోటల్ సిబ్బంది అందుకు సమ్మతించలేదు. అయితే తనకు రూమ్ క్యాన్సిల్ చేసి తన డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వమని ఆమె కోరింది. కానీ తమ హోటల్ బుకింగ్ క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం డబ్బులు తిరిగి ఇవ్వలేమని హోటల్ సిబ్బంది సమాధానమిచ్చారు దీంతో నటికీ హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. 


అయితే ఎంత సేపటికీ వారు డబ్బు తిరిగి ఇవ్వడానికి సమ్మతించక పోవడంతో సహనం కోల్పోయిన ఆమె వారితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. తాము కంట్రోల్ చేయలేము అని భావించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పుణేలో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన దామిని స్క్వాడ్ కి చెందిన లేడీ ఆఫీసర్లు కొంతమంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు సరి కదా పోలీసులతో కూడా గొడవకు దిగింది. 


అయితే ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పర్వీన్ షేక్ అనే మహిళ అధికారిణి మీద పలుసార్లు ఆమె దాడి చేసి కరచినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. హోటల్ వాళ్ళు ఫిర్యాదు చేయకపోయినా డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిణి మీద దాడి చేసినందుకు గాను ఆమె మీద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించడం), సహా 332, 427, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ మంజుషా ములుక్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె పేరు సహా ఇతర వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. 
Also Read: Pavitra Lokesh: వెంట పడి వేధిస్తున్నారు.. ఆ ఇద్దరిపై పవిత్ర లోకేష్ ఫిర్యాదు


Also Read: F3 Movie : మాట నిలబెట్టుకున్న దిల్ రాజు.. ఆరోజునే ఎఫ్3 ఓటీటీ రిలీజ్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook