Bigg Boss OTT: బుల్లితెర ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఓటీటీ వెర్షన్ కు రెడీ అయింది. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'బంపర్ ఆఫర్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ బిందు మాధవి (Bindhu Madhavi). ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు అవకాశాలు తగ్గడంతో...కోలీవుడ్ వైపు మళ్లింది.  అక్కడ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు.. ఈ సారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. 



తాజాగా బిందు మాధవికి సంబంధించిన ఓ పోస్ట్ ను బిగ్ బాస్ ఓటీటీ (Telugu Bigg Boss OTT) మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ముఖం సరిగా కనిపించని ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి అంటూ క్విజ్ పెట్టారు. ఇందులో బిందు మాధవి స్పష్టంగా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షోలో బిందు అదరగొడితే మళ్లీ తెలుగులో అవకాశాలు పొందవచ్చు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook