Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ వీళ్లేనట... వైరల్ అవుతోన్న లిస్ట్..!

Bigg Boss OTT: ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ డిజిటల్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేబోయే కంటెస్టెంట్ల్ ఎవరనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 04:07 PM IST
Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ వీళ్లేనట... వైరల్ అవుతోన్న లిస్ట్..!

Bigg Boss Telugu OTT Contestants : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా ముగించుకున్న ఈ షో..ఇప్పుడు డిజిటల్ వెర్షన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది. నిన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో నాగార్జునతో (Nagarjuna) పాటు వెన్నెల కిషోర్, మురళీ శర్మ సందడి చేశారు. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ (Telugu Bigg Boss OTT) ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 

అయితే ఈ షోలో  పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనేది స్పష్టత రాకపోయినా..పలు పేర్లు నెట్టింట వైరల్  అవుతున్నాయి.  కొంతమంది మాజీ కంటెస్టెంట్లు కూడా ఈ షోలో  పాల్గొనబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ జాబితా ( Bigg Boss Telugu OTT Contestants) పేరుతో ఓ లిస్ట్ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. 

ఇందులో అరియానా గ్లోరీ, అఖిల్, ముమైత్ ఖాన్, సరయు, హమీద, నటరాజ్, మహేష్ విట్టా, మోడల్ అనిల్ రాథోడ్, అషు రెడ్డి, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతు, చిచా చార్లెస్, యాంకర్ శివ, విశ్వక్ మూవీ హీరో అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ, రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News