Nivetha Pethuraj Slams: సినీ పరిశ్రమలో ఉన్ననాళ్లు ఫేమ్‌, డబ్బు సంపాదించుకున్న హీరోయిన్లు ఆ తర్వాత మంచి శ్రీమంతుడిని చూసి పెళ్లి చేసుకుంటున్నారు. వ్యాపారవేత్త, సినీ పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులను వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్‌ కూడా ఓ రాజకీయ నాయకుడిని ఇష్టపడుతోందని.. అతడితో ప్రేమలో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు ఆ హీరోయిన్‌కు ప్రేమ కానుకగా ఖరీదైన బంగ్లా ఇచ్చాడనే ఆరోపణలు బయటకు వచ్చాయి. సామాజిక మాధ్యమాలతోపాటు ప్రధాన మీడియాలో ఇలాంటి వార్తలు రావడంతో ఆ హీరోయిన్‌ విస్మయం వ్యక్తం చేసింది. 'అసలు మానవత్వం ఉందా?' అని తిట్టిపోసింది. ఈ సందర్భంగా తన సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేసింది. ఆ పోస్టు వైరల్‌గా మారింది. ఆమె ఎవరో కాదు నివేదా పేతురాజ్. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా


దక్షిణ సినీ పరిశ్రమలో 20 సినిమాల్లో నటించిన నివేథా పేతురాజ్‌ ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. దానికి సంబంధించి 'ఎక్స్‌'లో ఇలా పోస్టు చేసింది. 'నా కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారనే అసత్య వార్తలు నాకు ఆలస్యంగా తెలిసింది. తెలిసినా కూడా మౌనంగా ఉన్నా. ఇలాంటి విషయాలు మాట్లాడే తెలివి లేని కొందరు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు ఆలోచించరా? వచ్చిన సమాచారాన్ని ధ్రువీకరించకుండా మానవత్వం లేకుండా ఇలా ప్రసారం చేస్తారా? అలాంటి అసత్య వార్తల వలన కొన్నాళ్లుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి' అని విజ్ఞప్తి చేసింది. 

Also Read: Lock In Assembly: ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి తాళం వేయండి.. స్పీకర్‌కు తాళం ఇచ్చిన సీఎం


ఈ సందర్భంగా తన కుటుంబం.. తన గురించి నివేథా వివరిస్తూ.. 'నేను చాలా గౌరవంగా బతికే కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల నుంచే సొంతంగా ఆర్థికంగా నిలబడ్డా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లో ఉంటోంది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్నాం. సినిమా అవకాశాల కోసం ఏ నిర్మాత, దర్శకుడు, హీరోను ప్రాధేయపడలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేనెప్పుడూ డబ్బుకు అత్యాశ పడలేదు. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని మానసిక పరిణితి పెంచుకున్నా. అసత్య వార్తలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని భావిస్తున్నా. మీకు తెలిసిన సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో నాకు మద్దతు నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అంటూ ముగించింది.




వివాదం ఇక్కడ..?
హీరోయిన్‌ నివేథా పేతురాజ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే నివేథాకు రూ.50 కోట్ల విలువైన ఇల్లు బహుమతిగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. నివేథా పేతురాజ్‌ తెలుగు, తమిళ్‌ సినిమాల్లో నటించింది. 'మెంటల్‌ మదిలో' నివేథా తొలి సినిమా కాగా.. 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అలా వైకుంఠపురంలో', 'రెడ్‌', 'పాగల్‌', 'విరాట పర్వం', 'దాస్‌ కా ధమ్కీ' వంటి సినిమాల్లో నివేథా నటించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook