Pooja Hegde in Cirkus movie: పూజా హెగ్డే టాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌లలోనూ పూజా హెగ్డే ఒకరని చెప్పొచ్చు. పూజా టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా బిజీగా మారుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pooja Hegde Hindi movies; పూజా హెగ్డే హిందీ సినిమాలు:
2016లోనే తొలిసారిగా మొహెంజో దారో చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన పూజా హెగ్డెకు ఆ చిత్రం అంతగా కలిసి రాలేదు. హృతిక్ రోషన్ సరసన చేసిన మొహెంజో దారో మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) సరసన ‘హౌజ్‌ఫుల్ 4’ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ( Salman Khan ) సరసన ‘కబీ ఈద్ కబీ దివాళి’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Also read : 
Most eligible bachelor teaser update: మ్యారేజ్ లైఫా.. అయ్యోయ్యోయ్యో అంటున్న అఖిల్



ఇదిలా ఉండగా పూజా బాలీవుడ్‌లో మరో పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో 'సర్కస్' అనే సినిమాలో రణ్‌వీర్ సింగ్ ( Ranveer Singh ) హీరోగా.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే హీరోయిన్‌లుగా ( Jacqueline Fernandez, Pooja Hegde) నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది అని టాక్. షేక్ స్పీయర్ రచించిన ''ది కామెడి ఆఫ్ ఎర్రర్'' ( The Comedy Of Errors ) ఆధారంగా తెరకెక్కనుంది. టి సిరీస్ భూషణ్ కుమార్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి రోహిత్ శెట్టి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.  


పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధే శ్యామ్’ ( Radhe Shyam movie ) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అలాగే అఖిల్‌తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్. ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ సైతం విడుదల చేశారు. Also read : Bigg Boss Telugu 4: కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడా..! పంపించేశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe