Pooja hegde: నాజూకు అందాల సోయగం..నిజంగానే బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజిగా ఉన్న పూజా..నాగ్ చైతన్య సరసన థ్యాంక్యూ చెప్పబోతోంది. ఆ వివరాలేంటో చూద్దామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌ ( Tollywood )లో ఇప్పుడు పూజాహెగ్డేనే ఎవర్ గ్రీన్. ఓ వైపు నటన..మరోవైపు నాజూకు అందాలతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శాండల్ క్వీన్ సోయగాలతో పిచ్చెక్కిస్తున్న పూజాహెగ్డే ( Pooja hegde )కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. అది కూడా తెలుగులోనే. 


నాగ్ చైతన్య ( Nag Chaitanya ) అలియాస్ చైతూ కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న థ్యాంక్యూ చిత్రం ( Thank you ) షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దిల్‌రాజు (
Dilraju ) నిర్మాతగా ఉన్న ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేకు అవకాశమొచ్చినట్టు తెలుస్తోంది. కధలోని కొత్తదనం ఆమెకు నచ్చడంతో అంగీకరించినట్టు సమాచారం. ఒక లైలా కోసం చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి కలిసి కన్పించనున్నారు. ప్రస్తుతం  పూజాహెగ్డే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటిస్తోంది. 


Also read: Tuck Jagadish release date: టక్ జగదీష్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook