Liquor bottles in actress Ramyakrishna`s car | హైదరాబాద్: సినీ న‌టి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం ప‌ట్టుబ‌డటం అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మహాబలిపురం నుంచి చెన్నైకి వస్తున్న వాహనాలను తమిళనాడు పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ముతుకడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అటుగా వచ్చిన TN07 CQ 0099 నెంబర్ గల టయోటా ఇన్నోవా కారు కంటపడింది. ఆ కారును ఆపిన పోలీసులు.. కారు డిక్కీలో 96 బీర్ బాటిల్స్, 8 లిక్క‌ర్ సీసాలు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆ సమయంలో సినీ నటి రమ్యక్రిష్ణ కూడా అదే కారులో ( Actress Ramyakrishnan`s car) ఉన్నట్టు తెలుస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం తరలించడం అనేది లాక్ డౌన్ నియమనిబంధనలకు ( Lockdown rules) విరుద్దం. అంతేకాకుండా తమిళనాడులో ప్రస్తుతం మద్యం ( TASMAC) విక్రయం, మద్యం తరలింపుపై నిషేధం ఉన్నందున, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు.. రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ని అదుపులోకి తీసుకుని ఆ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అనంతరం పోలీసులు సెల్వ కుమార్‌ని బెయిల్‌పై విడుదల చేసినట్టు సమాచారం. 


రమ్యక్రిష్ణ కారులో మద్యం బాటిళ్లతో పట్టుబడటంపై అటు తమిళ సినీ పరిశ్రమలో ( Kollywood) ఇటు తెలుగు సినీ పరిశ్రమలో ( Tollywood) సినీ ప్రముఖులు రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో మళ్లీ లాక్ డౌన్ రూల్స్ కఠినతరం చేస్తారనే వార్తల నేపథ్యంలో చాలామంది బయటి ప్రాంతాల నుంచి ( మద్యం విక్రయాలు జరుగుతున్న చోటు నుంచి) ముందస్తుగానే భారీ మొత్తంలో మద్యం సీసాలు ( Liquor bottles) కొని తరలిస్తున్న ఘటనలు అడపాదడపా పోలీసుల తనిఖీల్లో వెలుగుచూస్తూనే ఉన్నాయి. హీరోయిన్ రమ్యకృష్ణ ఉదంతం కూడా అటువంటిదే అయ్యుంటుందనే టాక్ వినిపిస్తోంది.