Rashi Khanna: కావాలనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి: రాశీ ఖన్నా
నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను... ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా అని రాశీ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంతలోనే ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చిందని. అనంతరం, అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్‌తో తనను కలిసారని చెప్పింది. కాదనలేకపోయానని. ఆ తర్వాత నా జీవిత ప్రయాణమంతా మీకు తెలిసిందేనని చెప్పుకొచ్చింది బ్యూటీ
Rashi Khanna Interesting Comments: ప్రతీ మనిషి తన జీవితంలో పలు రకాల కోరికలు కోరుకుంటూ..తమ జీవనాన్ని ముందుకు నడిపిస్తారు. జీవితంలో వారికి నచ్చింది కావాలని ఆశపడుతుంటారు. కానీ జీవితంలో పరిస్థితుల ప్రభావం, ప్రతికూల సమయం, అనుకూల సమయాలు.. కారణం ఏదైనా అనుకున్నది కాకుండా మరొకటి అవుతుంటారు. ఇది ప్రస్తుత కాలంలో సహజమైంది. ఈ అనుభవాలు చాలా మంది జీవితాల్లో ఎదురయ్యే ఉంటుంది.
అయితే తన జీవితం కూడా ఇలానే జరిగిందన్నారు అందాల తార రాశీ ఖన్నా.ప్రతి మనిషిలో కోరిన దాని పై ఇష్టం పెంచడం ఎంత సులువో.. దానిని సాధించడం కూడా అంతే కష్టమన్నారు.తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల అభిమానులతో పంచుకుందీ అందాల ముద్దు గుమ్మ. అయితే మూవీలో హీరోయిన్‌గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న తరుణంలోనే ఓటీటీ బాట పట్టింది రాశీ. మూవీలో కాకుండా ఓటీటీలో కూడా నటించడంతో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందని సినీ బజ్.ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన రుద్రలో నటించి డిజిటల్ ప్రేక్షకులను పలకరించిందీ మిల్కీ బ్యూటీ.
తాజాగా మీడియా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అందల బొమ్మ. తన జీవితంలో తొలి నాళ్లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. 'నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను... ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా అని రాశీ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంతలోనే 'మద్రాస్ కేఫ్'లో అవకాశం వచ్చిందని. అనంతరం, అవసరాల శ్రీనివాస్ 'ఊహలు గుసగుసలాడే' స్క్రిప్ట్‌తో తనను కలిసారని చెప్పింది. కాదనలేకపోయానని.. ఆ తర్వాత నా జీవిత ప్రయాణమంతా మీకు తెలిసిందేనని చెప్పుకొచ్చింది బ్యూటీ.
ఈ నేపథ్యంలో రాశీ రుద్ర వెబ్ సిరీస్ గురించి స్పందించింది, వెబ్ సిరీస్‌కు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదన్నారు.నేను నటించిన ఆలియా చోక్సీ క్యారెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది రాశీ తెలిపింది.ఇప్పటికీ తనకు పలువురు అభినందనలు తెలుపుతున్నారన్నారు. అదో విచిత్రమైన పాత్ర, అలాంటి పాత్ర తనకు మంచి పేరు తేవడం చాలా సంతోషమన్నారు. కాఠినత్వంలో సున్నితత్వం తొంగిచూస్తుందని. ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. కొంచెం రిస్క్ చేస్తున్నానేమో అనిపించిందన్నారు. అందుకు తగిన ప్రతిఫలం దక్కిందని తెలిపిందీ అందాల తార రాశీ.
Also Read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..
Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook