Rashmika gym Video: జిమ్ లో తెగ కష్టపడుతున్న రష్మిక మందన్నా, వీడియో వైరల్
Rashmika gym Video: ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో తెగ కష్టపడుతోంది రష్మిక మందన్నా. ఈ బ్యూటీ వర్కౌట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Rashmika Mandanna gym Video Viral: సినీ ఇండస్ట్రీలో గ్లామర్ తో పాటు ఫిటెనెస్ కూడా చాలా అవసంరం. అందుకే తమ బాడీని ఫర్పెక్ట్ గా ఉంచడానికి హీరోలు, హీరోయిన్స్ జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. ట్రైనర్ల సమక్షంలో చెమటను చిందిస్తూ...తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటారు. మన శ్రీవల్లి అయితే జిమ్ లో వ్యాయామం చేస్తూ...తన అందాన్ని మరింత పెంచుకుంటుంది. రష్మిక వర్కౌట్ చేస్తున్న వీడియో (Rashmika Mandanna Gym Workout Video) తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియోలో రష్మిక (Rashmika Mandanna) పసుపు రంగు షార్ట్, బూడిద రంగు టీ షర్ట్ ధరించి కసరత్తులు చేస్తూ ఉంటుంది. ట్రైనర్ సమక్షంలో ఈ బ్యూటీ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు ఈ అమ్మడు తెగ కష్టపడుతోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక..తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ క్రేజీ సంపాదించుకుంది. ఈ బ్యూటీ త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా చిత్రం 'మిషన్ మజ్ను'తో బాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోతోంది. దీంతోపాటు రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' చిత్రంలో కూడా నటిస్తోంది. రష్మిక 2016లో కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో తన కెరీర్‌ని ప్రారంభించింది.
Also Read: SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్.. అర్ధ గంటలోనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook